తమిళనాడు షాక్: జయలలితపై పదేళ్లపాటు అనర్హత
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలని తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. తమిళనాడు అసెంబ్లీ సభ్యురాలైన జయలలితకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడిన 2014, సెప్టెంబర్ 27వ తేదీ నుండి అనర్హత వర్తిస్తుందని తెలిపింది.
జయలలిత ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీరంగపురం అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ అయినట్లుగా పరిగణిస్తామని తమిళనాడు ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది. శ్రీరంగపురం స్థానం ఖాళీ అయినట్లుగా పరిగణిస్తామని తెలిపింది. ఈ స్థానం ఖాళీ అయినట్లుగా ఇంతకుముందే వెల్లడించినా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా వెల్లడించింది.

క్షమాభిక్ష పెడతాం: శ్రీలంక
మరణ శిక్షపడిన ఐదుగురు భారత జాలర్లకు విముక్తి కల్పించే దిశగా శ్రీలంక చర్యలు తీసుకుంటోంది. లంక అధ్యక్షుడు మహింద రాజపక్స మరో రెండు, మూడు రోజుల్లో జాలర్లకు క్షమాభిక్ష ప్రసాదించనున్నారు. అంతేకాక ఈ విషయంలో ఎలాంటి షరతులను కూడా లంక ప్రతిపాదించబోదని సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా మాట్లాడిన తర్వాత జాలర్లకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు మహింద రాజపక్స సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కొలంబోలోని భారత రాయబార కార్యాలయానికి చేరవేయాలని రాజపక్స ఆదేశాలు జారీ చేశారని టెలి కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి ప్రభా గణేశన్ చెప్పారు.
మరణ శిక్షను రద్దు చేయనున్న శ్రీలంక.. జాలర్లను భారత దేశంలోని జైలుకు తరలించనుంది. రామేశ్వరం వద్ద 2011లో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న ఆరోపణలపై భారత జాలర్లను శ్రీలంక అరెస్ట్ చేసింది. వారు లంక జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications