సీఎంగా జయలలిత జీతం 'ఒక్క రూపాయి' మాత్రమే..

సాధారణంగా ప్రభుత్వానేధితలు లక్షా ఆపై జీతాలు తీసుకుంటున్నా.. జయలలిత మాత్రం ఒక్క రూపాయినే తన జీతంగా స్వీకరిస్తూ వచ్చింది.

చెన్నై: మొత్తంగా ఆరుసార్లు సీఎంగా ఎన్నికైన తమిళ దివంగత నాయకురాలు జయలలితకు సంబంధించి ఇదో ఆసక్తికర కథనం. సాధారణంగా ప్రభుత్వానేధితలు లక్షా ఆపై జీతాలు తీసుకుంటున్నా.. జయలలిత మాత్రం ఒక్క రూపాయినే తన జీతంగా స్వీకరించింది. జయ నిర్ణయానుసారమే ఆమెకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా అందేది.

సీఎంగా ఎన్నికైన తొలి నెలలోనే తనకు జీతం అవసరం లేదని జయలలిత చెప్పారట. తన జీవనం కొనసాగడానికి అవసరమైన అన్ని వనరులు తన వద్ద ఉన్నాయని, జీతంతో పనిలేదని ప్రకటించారు. అయితే రాజ్యాంగ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రులు తప్పనిసరిగా వేతనం తీసుకోవాలన్న నియమం ఉండడంతో.. కేవలం ఒక్క రూపాయిని మాత్రమే జీతంగా స్వీకరిస్తూ వస్తున్నారు.

Jayalalithaa drew a salary of just one rupee as chief minister

తను మరణించేదాకా ఇదే నిర్ణయాన్ని కొనసాగించారు జయ. ఏనాడు ఒక్క రూపాయి కన్నా ఎక్కువ జీతాన్ని ఆమె ఆశించలేదు. కాగా, దేశంలో మాణిక్ సర్కార్ ఒక్కరే అత్యంత ఆదర్శ సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తన జీతం మొత్తాన్ని అక్కడి పేదల వైద్యం కోసమే ఖర్చు చేస్తూ వస్తున్నారు. ఆయన భార్య సైతం స్వయంగా నడుచుకుంటూ వెళ్లి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి.

ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉన్నా.. వాటిని కుటుంబ అవసరాల కోసం వాడుకోరు. 1998నుంచి త్రిపుర సీఎంగా కొనసాగుతున్న కమ్యూనిస్ట్ నేత మాణిక్ సర్కార్ ఆస్తులు కూడా దాదాపు రూ.3లక్షల లోపే కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+