జయలలిత చీర లాగిన దుశ్శాసునుడు ఎవరో తెలుసా!

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో జయలలితకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సామాన్య పార్టీ కార్యకర్తగా 1982లో రాజకీయాల్లో ప్రవేశించిన జయలలిత ఒక్క సంవత్సరంలోనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యారు.

1984లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితులయ్యారు. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించారు. 1987లో ఎంజీఆర్ మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది.

అనంతరం పార్టీ నాయకులు అందరూ జయలలితకు దగ్గర అయ్యారు. 1987లో తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష తొలి మహిళా నాయకురాలిగా జయలలిత చరిత్ర సృష్టించారు. 1989లో అప్పటి ముఖ్యమంత్రి సమక్షంలోనే సాక్షాత్తు అసెంబ్లీలో జయలలితకు తీరని అవమానం జరిగింది.

Jayalalithaa joined the AIADMK, the party MGR founded.

కరుణానిధి పార్టీ డీఎంకే కి చెందిన సీనియర్ నాయకుడు దురై మురుగన్ అసెంబ్లీలోనే జయలలిత జుట్టుపట్టుకుని దాడి చెయ్యడానికి ప్రయత్నించి చీరలాగెయ్యడానికి విశ్వప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఆ సంఘటన జయలలిత రాజకీయ జీవితంలో కొత్తమలుపు తిరిగింది. ఈ సభలో తాను ముఖ్యమంత్రిగానే అడుగుపెడుతానని చాలెంజ్ చేసి బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి జయలలిత అసెంబ్లీలో అడుగుపెట్టలేదు.

1991లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఘనవిజయం సాధించడంతో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటి నుంచి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. చివరికి జయలలిత చీర లాగారని ఆరోపణలు ఎదుర్కొన్న దురై మురుగన్ రాజకీయ జీవితం అంతం అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+