18 ఏళ్ల నాటి ఐటి కేసు: రూ. 2కోట్లు చెల్లించిన జయలలిత
చెన్నై: 18 ఏళ్ల నాటి ఆదాయం పన్ను కేసులో రాజీ పడుతూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలిత తన ప్రియసఖి శశికళతో కలిసి 1.99 కోట్ల రూపాయలు చెల్లించారు. ఐటి కేసు మూసివేతకు ఆమె ఆ మొత్తాన్ని చెల్లించారు. జయలలిత, శశికళ భాగస్వాములుగా ఉన్న కంపెనీ ఆదాయం పన్ను శాఖకు ఆ మొత్తం బాకీ పడింది.
జయలలిత రూ.30,83,887 చెల్లించగా, శశికళ రూ.28,07,972 చెల్లించారు. 1993-94 అసెస్‌మెంట్ ఇయర్‌లో వార్షిక పన్ను రిటర్న్స్ సమర్పించనందుకు ఆదాయం పన్ను శాఖ కేసు పెట్టింది. 1991-92, 19992-93 అసెస్‌మెంట్ ఇయర్స్‌కు గాను శశి ఎంటర్‌ప్రైజెస్ రూ. 75,33,330, రూ.65,67872 కాంపౌండ్ ఫీజు కింద చెల్లించింది. కాంపౌండ్ ఫీజుతో పాటు వారు ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్‌మెంట్ చార్జీలు, లిటిగేషన్ ఖర్చులు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

జయలలిత రూ.7,52,632 కాంపౌండ్ ఫీజు, రూ.50,000 ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్‌మెంట్ చార్జీలు, రూ.22,81,250 లిటిగేషన్ ఖర్చులు చెల్లించారు. రాజీకి నవంబర్ 26వ తేదీన జరిగిన ఆదాయం పన్ను శాఖ ప్రాంతీయ కాంపౌండింగ్ కమిటీ అంగీకారం తెలిపింది. నవంబర్ 27వ తేదీన జయలలిత, శశికళ ఆ మొత్తాన్ని చెల్లించారు. దాంతో జయలలిత, శశికళ, శశి ఎంటర్‌ప్రైజెస్‌లపై పెట్టిన కేసు మూత పడుతుందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామసామి కె చెప్పారు. ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోనున్నట్లు చెప్పారు.
ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించి ఎగ్మూరు కోర్టులో విచారణలో ఉన్న కేసును ఆమె ఆదాయ పన్ను శాఖతో రాజీ కుదుర్చుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల కిందట వరుసగా రెండేళ్లపాటు (1991-92, 1992-93) జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళకు చెందిన జయ పబ్లికేషన్, శశి ఎంటర్‌ప్రైజస్‌లు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయలేదు.
దీంతో వారిద్దరూ ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఆదాయ పన్ను శాఖ ఇద్దరిపైనా క్రిమినల్ కేసు దాఖలు చేసింది. కేసు విచా రణ నిమిత్తం పలుమార్లు కోర్టుకు హాజరు కావాల్సిందిగా జయను కోర్టు ఆదేశించినా, వాయిదాలు కోరు తూ వచ్చారు. దీనిపై సామరస్యంగా పరిష్కరించుకునే సౌలభ్యాన్ని సుప్రీం సూచించింది. కోర్టు బయటే పన్ను చెల్లింపులకుసంబంధించి సెటిల్‌మెంట్ చేసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు సూచించింది.












Click it and Unblock the Notifications