చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత మృతిలో మరో ట్విస్ట్: అపోలో ప్రీతారెడ్డి సంచలనం

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వ్యవహారం మరో మలుపు తిరిగింది. అపోలో అస్పత్రి ఉన్నతాధికారి ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. ఆస్పత్రికి ఆమెను ఓ స్థితిలో తెచ్చారో వివరించారు.

Recommended Video

Jayalalithaa Case probe : విచారణకు వెంకయ్యనాయుడు, విద్యాసాగర్‌రావు కూడా !

నిరుడు జయలలిత 75 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది నిరుడు డిసెంబర్ 5 తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. అపోలో ఆస్పత్రుల వైస్ చైర్‌పర్సన్ ప్రీతా రెడ్డి జయలలితకు సంబంధించిన మరిన్ని విషయాలను బయట పెట్టారు.

ఊపిరాడని స్థితిలో తెచ్చారు...

ఊపిరాడని స్థితిలో తెచ్చారు...

జయలలితను నిరుడు సెప్టెంబర్ 22వ తేదీన ఊపిరాడని స్థితిలో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తీసుకుని వచ్చారని, ఆ విషయాన్ని ఆమె పక్కన ఉన్నవారు కూడా ధ్రువీకరించారని ప్రీతా రెడ్డి చెప్పారు. ఆమెకు తగిన చికిత్స చేశామని, దాంతో ఆమె కోలుకున్నారని అన్నారు.

ఎవరూ ఏమీ చేయలేరు, దురదృష్టం...

ఎవరూ ఏమీ చేయలేరు, దురదృష్టం...

ప్రీతారెడ్డి ఓ తమిళ టీవీ చానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత మృతి గురించి మాట్లాడారు. దురదృష్టవశాత్తు, ఫలితం ఎలా వచ్చిందో మీకు తెలుసు, ఎవరూ అటువంటి ఫలితం కోసం చూడలేదు అని అన్నారు. అది తలరాత అని, అటువంటి స్థితిలో ఎవరైనా ఏమైనా చేస్తారని అనుకోవడం లేదని అన్నారు.

అత్యుత్తమ సేవలే అందించాం...

అత్యుత్తమ సేవలే అందించాం...

జయలలితకు తాము అత్యుత్తమ సేవలే అందించామని ప్రీతారెడ్డి జయలలిత మృతిపై చెలరేగిన వివాదంపై ప్రశ్నించినప్పుడు అన్నారు. న్యూఢిల్లీ నుంచి, విదేశాల నుంచి ఉత్తమ వైద్యులను పిలిపించామని అన్నారు. ఎయిమ్స్ వైద్యులు కూడా వచ్చారని అన్ారు. తాము చేయాల్సిందంతా చేశామని చెప్పారు.

విచారణ సాగుతోంది, ముగుస్తుందని...

విచారణ సాగుతోంది, ముగుస్తుందని...

విచారణ జరుగుతోందని, అది మంచి విషయమని తాను అనుకుంటున్నానని, డేటాను వారు పరిశీలిస్తే, అన్ని మిస్టరీలు కూడా విడిపోతాయని తాను భావిస్తున్నానని ప్రీతా రెడ్డి అన్నారు. జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్డి ఎ అరుముగస్వామి నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ఏకసభ్య సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సంఘం ఇప్పటికే విచారణ ప్రారభంచింది.

వేలిముద్రలపై చెప్పలేను...

వేలిముద్రలపై చెప్పలేను...

తన వేలిముద్రలు తీసుకుంటున్నట్లు జయలలితకు తెలుసా అని అడిగితే ఈ ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని, ఆ సమయంలో తాను అక్కడ లేనని ప్రీతా రెడ్డి సమాధానమిచ్చారు. అప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో అన్నాడియంకె అధికారిక అభ్యర్థిగా ఖరారు చేసినట్లు ఆమె వేలిముద్రలతో నామినేషన్ పత్రం వేసిన విషయం తెలిసిందే.

English summary
The late Tamil Nadu Chief Minister J Jayalalithaa was brought to Apollo Hospital in a 'breathless state' on September 22 last year and those she approved were beside her during her treatment there, a top hospital official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X