వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయం సింగ్ తో భేటీ అయిన సినీ నటి జయప్రద

చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న సిని నటి జయప్రద న్యూఢిల్లీలోని ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో ఆయనతో సమావేశమైంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన ములాయంతో సమావేశం కావడ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న సినీ నటి జయప్రద హఠాత్తుగా న్యూఢిల్లీలోని ములాయం సింగ్ యాదవ్ ఇంటికి చేరుకొన్నారు. అమర్ సింగ్ తో పాటు ఆమె సమాద్ పార్టీకి దూరమయ్యారు.అయితే హఠాత్తుగా ఆమె ములాయం సింగ్ ఇంటివద్ద ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది.

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అమర్ సింగ్ చక్రం తిప్పే సమయంలో జయప్రద సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆమె ఉత్తర ప్రదేశ్ నుండి ఎంపిగా పనిచేశారు.అయితే అమర్ సింగ్ పై పార్టీ వేటేసిన తర్వాత జయప్రద కూడ సమాజ్ వాదీ పార్టీకి దూరమయ్యారు.

అయితే సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న విబేధాల నేపథ్యంలో అమర్ సింగ్ లండన్ నుండి ఢిల్లీకి చేరుకొన్నాడు. ఎన్నికల సంఘానికి సైకిల్ గుర్తు తనకే ఇవ్వాలని ములాయం సింగ్ యాదవ్ కొరనున్నారు.

jayaprada met mulayamsingh residence in new delhi

లండన్ నుండి వచ్చిన ములాయం సింగ్ యాదవ్ శివపాల్ యాదవ్ తో పాటు ఇతర తన సన్నిహితులతో ఢిల్లీలోని తన నివాసంలో సుధీర్ఘంగా చర్చింరు. అదే సమయంలో సినీ నటి జయప్రద కూడ ఈ సమావేశానికి హజరయ్యారు.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని జయప్రద ప్రకటించారు.అయితే పార్టీలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ములాయం తన సన్నిహితులతో సమావేశం నిర్వహిస్తుండగా జయప్రద ములాయం సింగ్ ఇంటికి రావడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఆమె ములాయం వెంటే ఉంటారా లేదా రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై ఆమె ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.

English summary
actress , former samajwadi party leader jayaprada reaches mulayamsingh residence in newdelhi, when mulayam meeting with amarsingh, shivapal yadav other leaders she came to the mulayam house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X