మోడీ పొరపాటు చేస్తున్నారు, అందుకే కేజ్రీ గెలుపు: లోక్‌సత్తా జేపీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పొరపాటు చేస్తున్నారని, పార్లమెంటు ఎన్నికలు వేరు, రాష్ట్రాల ఎన్నికలు వేరని లోక్‌సత్తా పార్టీ చీఫ్ జయప్రకాశ్ నారాయణ మంగళవారం అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన ఆయన స్పందించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటు వేశారో ఆ పార్టీ ఆలోచించాలని హితవు పలికారు.
ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలంతా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారని చెప్పారు. గత ఎన్నికల్లో 28 స్థానాలు ఇచ్చిన ప్రజలు... ఇంకా కొంచెం కష్టపడితే ఏఏపీని గెలుస్తుందని భావించడం వల్లే ఇంత భారీ విజయం సాధించిందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అంతర్థానమయిందన్నారు. ఢిల్లీ ప్రజలు కులమతాలు చూసి ఓట్లు వేయలేదని చెప్పారు. సంప్రదాయ రాజకీయ వారసత్వానికి కాంగ్రెస్ పార్టీ పరాకాష్ట అని మండిపడ్డారు. వారసత్వ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ చిక్కుకుపోయిందని అన్నారు.
అదే విధంగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా బీజేపీ నడవడం లేదని విమర్శించారు. ప్రజలు మార్పు కోసమే మోడీని గెలిపించారని, దానిని గుర్తించాలన్నారు. ఎవరి స్థానంలో వారు పని చేయాలన్నారు. ఓట్లు, సీట్ల కోసం చూడవద్దని చెప్పారు.












Click it and Unblock the Notifications