అర్దరాత్రి యముడి రూపంలో వచ్చిన జేసీబీ, పాపం పొలంలో కూలీలు అందరూ !
బెంగళూరు: రాత్రి పొలంలో బోరుబావి వేసి పొలానికి వెళ్లే రహదారిలో కూలీలు నిద్రపోయారు. ఆ సమయంలో నిద్రిస్తున్న ముగ్గురు కూలీల మీద వేగంగా వెళ్లిన జేసీబీ దూసుకుపొవడంతో ముగ్గురు కూలీలు స్పాట్ లో మృతి చెందారు. పొట్టకూటికోసం వెళ్లిన ముగ్గురు యువకులు అర్దరాత్రి వరకు కష్టపడి భోజనం చేసి నిద్రపొవడంతో నిద్రలోనే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని నిలవంజి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విష్ణు (26), శివరామ్ (28), బలరామ్ (30) అనే ముగ్గురు యువకులు చనిపోయారని పోలీసు అధికారులు అంటున్నారు. మంగళవారం రాత్రి పొలంలో బోర్‌వెల్ వేసి అలసిపోయిన కూలీలు పొలం సమీపంలోని ఓ రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు.

అయితే మంగళవారం అర్దరాత్రి పొలంలోని రోడ్డు పక్కన నిద్రిస్తున్న కూలీల మీద జేసీబీ వారిపై దూసుకుపోయింది. ముగ్గురు కార్మికులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. నీలవంజి గ్రామానికి చెందిన బాలయ్యకు చెందిన జేసీబీ ప్రమాదానికి కారణ: కావడంతో ఆ వాహనం డ్రైవర్ పరారయ్యాడని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై దేవదుర్గ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
బోర్‌వెల్ వేసిన భూమి దున్నినందున ఇంకా ఆ భూమి చదును కాలేదు. దీంతో కూలీలు పొలం బయట లెవెల్ గ్రౌండ్‌గా ఉన్న ప్రాంతం వెతుక్కుంటూ వెళ్లి రొడ్డు పక్కన నిద్రపోయారని పోలీసులు అంటున్నారు. అర్దరాత్రి వరకు కష్టపడిన ముగ్గురు కూలీలు పడుకున్న వెంటే గాఢనిద్రలోకి వెళ్లిపోయారని, జేసీబీ వచ్చిన విషయం వారు గుర్తించలేకపోయారని, జేసీబీ డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడిపాడని పోలీసు అధికారులు తెలిపారు.
బోర్ వెల్ వాహనంలో పని చేసేందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురు కూడా యజమానికి నమ్మకంగా పని చేస్తున్నారు. బోర్‌వెల్ డ్రిల్లింగ్ వాహనంలో వీళ్లు ప్రతిరోజు నిద్రించేవారు, అయితే బోర్ వేసిన తర్వాత వాహనం వేడిగా ఉండడంతో పొలం పక్కన ముగ్గురు నిద్రపోయారని పోలీసులు అన్నారు. జేసీబీ దూసుకుపోవడంతో ముగ్గురి శరీరాలు నుజ్జునుజ్జు అయ్యాయని, ప్రమాదానికి కారణం అయిన జేసీబీ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications