కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం, బీజేపీకి కష్టం, 8 నెలల్లో దోస్తీ ఢమాల్, మోడీ దెబ్బతో !
బెంగళూరు: 2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తోందని, అయితే అధికారం చేపట్టడంతో సాధ్యంకాదని ఉడిపిలోని కాపుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య జోస్యం చెప్పారు. 2018లో శాసన సభ ఎన్నికలు జరిగిన తరువాత కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఎర్పడుతుందని జోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య అన్నారు.

కాంగ్రెస్-జేడీఎస్
2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కవ స్థానాలకు కైవసం చేసుకుంటుందని, అందులో ఎలాంటి సందేహం లేదని జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య అన్నారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు ఒక్కటి అయ్యి బీజేపీకి అధికారాన్ని దూరం చేస్తారని ప్రకాష్ జోస్యం చెప్పారు.

సీఎం, డీసీఎం
2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల తరువాత జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ డీ. కుమారస్వామి మరో సారి ముఖ్యమంత్రి అవుతారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత దినేష్ గుండూరావ్ ఉప ముఖ్యమంత్రి అవుతారని జ్యోతిష్యుడు ప్రకాష్ తెలిపారు.

సిద్దరామయ్యకు అనారోగ్యం ?
2018 ఫిబ్రవరి నాటికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అనారోగ్యానికి గురౌతారని, ఆయన మరో సారి సీఎం అయ్యే అవకాశం లేదని ప్రకాష్ జోస్యం చెప్పారు. బీజేపీని అధికారానికి దూరం చెయ్యడానికి కాంగ్రెస్, జేడీఎస్ కచ్చితంగా ఒక్కటి అవుతాయని జ్యోతిష్యుడు ప్రకాష్ వివరించారు.

8 నెలల్లో మళ్లీ ఎన్నికలు
2018 శాసన సభ ఎన్నికల తరువాత కర్ణాటకలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వానికి కేవలం 8 నెలల మాత్రమే అవకాశం ఉంటుందని, తరువాత వారి మధ్య విభేదాలు మొదలై ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, అనంతరం జరిగే లోక్ సభ ఎన్నికలతో పాటు కర్ణాటకలో మళ్లీ శాసన సభ ఎన్నికలు జరుగుతాయని, ఆ సందర్బంలో ప్రధాని మోడీ హవాతో బీజేపీ పూర్తి మోజారిటీతో అధికారంలోకి వస్తోందని జ్యోతిష్యుడు ప్రకాష్ వివరించారు.

సీఎంగా బ్రహ్మచారి ?
కర్ణాటకలో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకున్న తరువాత ఆర్ఎస్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓ బ్రహ్మచారిని సూచిస్తారని, ఆయన జాతకం తన దగ్గరకు ఇంకా చేరలేదని, జాతకం వచ్చిన తరువాత ఆయన పేరు బహిరంగంగా చెబుతానని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య వివరించారు.












Click it and Unblock the Notifications