కింగ్ మేకర్‌గా జేడీఎస్..కన్నడ పాలిటిక్స్‌ను శాసించనున్న కుమారస్వామి
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. కడపటి వార్తలు వచ్చే సరికి కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అనే రితీలో ఫలితాలు వస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీలో హంగ్ ఏర్పడితే జనతాదళ్ (జేడీ (ఎస్)) సెక్యులర్ పార్టీ పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. దేశ రాజకీయ విశ్లేషకులు ఊహించినట్టే జేడీఎస్ నేత కుమారస్వామి కర్ణాటకలో చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటును శాసించే స్థాయికి కుమార్ స్వామి రాజకీయాలు పెరిగిపోతాయి.
Recommended Video


కాంగ్రెస్ పార్టీకి మద్దతుపై
బీజేపీ కంటే మెజారిటీ స్థానాలు సంపాదించుకొంటే కాంగ్రెస్ పార్టీకి జేడీఎస్ మద్దతు ఇవ్వడానికి ముందుకు రావొచ్చు. ప్రభుత్వం ఏది ఏర్పడినా గానీ కుమారస్వామి బ్లాక్‌మెయిలింగ్ పాలిటిక్స్‌కు పుష్కలంగా అవకాశాలు ఉంటాయి.

బీజేపీకి దూరంగా
దేశవ్యాప్తంగా బీజేపీ అసంతృప్తి పెరగడం, మతతత్వ పార్టీ అనే ముద్రతో కుమారస్వామి కాషాయ జెండాకు దూరంగా ఉండటానికి పావులు కదుపుతాడు. కర్ణాటకలో రాజకీయంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు.

తెరపైకి దళిత సీఎం కార్డు
దళిత సీఎం అనే కార్డును ప్రయోగించిన కాంగ్రెస్ ఎజెండాను అమలు చేయడానికి కుమారస్వామి పట్టుబట్టవచ్చు. అలాగే డిప్యూటీ సీఎం పదవిని కుమారస్వామి చేపట్టవచ్చు.

కుమారస్వామి పవర్ పాలిటిక్స్
పూర్తిస్థాయిలో ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కుమారస్వామి పవర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనే అంశంపై రాజకీయ విశ్లేషకుల్లో చర్చలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications