వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

JEE Main 2021: నిన్న పరీక్ష షెడ్యూల్ విడుదల..నేడు రద్దు: అభ్యర్థుల్లో ఆందోళన

|
Google Oneindia TeluguNews

జేఈఈ మెయిన్ 2021 పరీక్ష పై సందిగ్ధత కొనసాగుతోంది. మంగళవారం రోజున జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించి షెడ్యూలు విడుదలైన కొన్ని గంటలకే ఇంకా పరీక్ష తేదీలు ఖరారు చేయలేదని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. జేఈఈ మెయిన్‌ 2021 పరీక్షకు సంబంధించి పూర్తి బ్రోచర్‌ను మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసి తన అధికారిక వెబ్‌సైట్‌పై పొందుపర్చింది. అయితే ఇప్పుడు దీన్నే విత్ డ్రా చేసుకోవడం జరిగింది. జేఈఈ బ్రోచర్ ప్రకారం మెయిన్ పరీక్ష ఫిబ్రవరి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం నాలుగు విడతలుగా జరగాల్సి ఉంది.

ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్ 2021 పరీక్షపై స్పష్టమైన ప్రకటన చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్. బుధవారం సాయంత్రం 6 గంటలకు పరీక్షకు సంబంధించిన కొత్త షెడ్యూలును విడుదల చేస్తామని చెప్పారు. అంతకుముందు కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించాలని భావించడం జరిగింది. ఇదే విషయంపై విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ డిసెంబర్ 10వ తేదీన విద్యార్థులతో జరిగిన భేటీలో కూడా పరోక్షంగా చెప్పడం జరిగింది.

జేఈఈ మెయిన్ పరీక్ష జరిగిన నాలుగు లేదా ఐదు రోజులకే ఫలితాలు వస్తాయని నోటిఫికేషన్‌లో పొందుపర్చారు. అంతేకాదు జనవరి తొలివారంలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు విడుదల చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది. బోర్డు పరీక్షలతో క్లాష్ కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌టీఏ వెల్లడించింది. ఇక జేఈఈ మెయిన్ పరీక్ష నోటిఫికేషన్‌ రద్దు కావడం అంటే వెబ్‌సైట్‌పై కూడా రిజిస్ట్రేషన్ లింక్ తీసేస్తారన్న విషయాన్ని అభ్యర్థులు గ్రహించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ 2021 పరీక్షను 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుందని మొదట నోటిఫికేషన్‌లో తెలపడం జరిగింది. ఇప్పుడు అలా ఉంటుందా లేదా అనేది మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

JEE Main 2021: Exam schedule withdrawn, new schedule to be announced says Ramesh Pokhriyal

అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం

దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 15,2020న ప్రారంభం అవుతుంది

దరఖాస్తుకు చివరి రోజు: జనవరి 15, 2021

అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు చివరితేదీ: జనవరి 16, 2021

ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు చివరి తేదీ: జనవరి 18-21వ తేదీ వరకు

అడ్మిట్ కార్డు ఫిబ్రవరి మొదటి వారం

English summary
JEE Main 2021 notification have been withdrawn and the new dates would be announced shortly said Union education Minister Dr. Ramesh Pokriyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X