వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఈఈ మెయిన్ 2021 మే సెషన్ పరీక్ష వాయిదా: కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడగా, తాజాగా జేఈఈ మెయిన్ (మే సెషన్) పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వాయిదా వేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.

తదుపరి అప్‌డేట్స్ కోసం ఎన్టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. మే 24 నుంచి 28 వరకు మే సెషన్ జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం ఈ ఏడాది నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహించేందుకు ఎన్టీఏ షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

JEE Main 2021 May Exam Postponed: Education Minister Ramesh Pokhriyal

ఇప్పటికే రెండు విడతల్లో ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు, మార్చి 16 నుంచి 18 తేదీల్లో పరీక్షలు పూర్తయ్యాయి. మూడో విడత పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి 30 వరకు జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా ఉధృతి దృష్ట్యా వాటిని వాయిదా వేశారు. దీంతో ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేయనున్నారు.

కాగా, తొలి విడత పరీక్షలను 6,20,978 మంది విద్యార్థులు రాశారు. రెండో సెషన్ పరీక్షలను 5,56,248 మంది విద్యార్థులు రాశారని ఎన్టీఏ వెల్లడించింది. మరోవైపు ఎన్టీఏ అబ్యాస్ యాప్ ద్వారా ఈ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ కావొచ్చని సూచించింది. జేఈఈ పరీక్ష వివరాల కోసం jeemain.nta.nic.in సంప్రదించాలని కోరారు.

జేఈఈ మెయిన్ 2021 పరీక్ష కోసం 20 లక్షల మందికిపైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 12 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. సుమారు మరో 8 లక్షల మంది వరకు పరీక్షలను రాయాల్సి ఉంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలనే కోరుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వారంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

English summary
JEE Main 2021 May Exam has been postponed by the National Testing Agency amid surge in COVID 19 cases in the country. The announcement has been made just now by the Education Minister Ramesh Pokhriyal. Students must keep a check on the official site for more updates on the revised dates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X