పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మాటు వేసిన మసూద్ అజర్- మరో పహల్గామ్ కు ప్లాన్?
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో మాటు వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పీఓకేలోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో కనిపించినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తోన్నాయి.
దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇండియా టుడే సేకరించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం- మసూద్ అజార్ ఇటీవలే గిల్గిట్- బాల్టిస్టాన్ లో కనిపించాడు. మదర్సాలు, ప్రైవేట్, ప్రభుత్వ అతిథి గృహాలు అధికంగా ఉండే స్కార్డ్- సత్పారా రోడ్ లో ఉన్నట్లు కొన్ని ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో మసూద్ అజర్ కనిపించడం ఆందోళనకరంగా భావిస్తోన్నారు. పాకిస్తాన్ లోని బహవల్‌పూర్ నుండి దాదాపుగా 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి అతను పీఓకేకు రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.
మసూద్ అజార్ తమ దేశంలో నివసించట్లేదని, అతను ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండవచ్చని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఇటీవలే ప్రకటించారు. తమ వద్ద నివసిస్తోన్నాడని భారత్ వాదించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ గడ్డపై అతను కనిపిస్తే భారత్‌కు అప్పగిస్తామనీ ఆయన అన్నారు.
ఈ ప్రకటన వెలువడిన అతి కొద్ది రోజుల్లోనే మసూద్ అజర్ పీఓకేలో కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2016 పఠాన్‌కోట్ వైమానిక బేస్ స్టేషన్, 2019 పుల్వామా దాడితో సహా అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు మసూద్ అజార్ సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. పుల్వామా దాడిలో 40 మందికి పైగా సైనికులు మరణించిన విషయం తెలిసిందే.
భారత్ కు అతను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అతని కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోన్నాయి భారత నిఘా ఏజెన్సీలు. బహవల్‌పూర్‌లో అజర్‌కు రెండు స్థావరాలు ఉన్నాయి. అందులో ఒకటి- జామియా సుభాన్ అల్లా. ఇది జైష్ ప్రధాన కార్యాలయం. ఆపరేషన్ సింధూర్ సమయంలో దీన్ని భారత్ నేలకూల్చింది.
మరొకటి జామియా ఉస్మాన్ అలీ మసీదు. ఇది జనసమ్మర్ధ ప్రాంతంలో ఉంది. ఇక్కడ అతని పూర్వీకుల నివాసం కూడా. జామియా సుభాన్ అల్లాపై భారత దాడుల్లో అజర్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. భారత్, అమెరికా, ఐక్యరాజ్యసమితి అతనిపై అనేక ఆంక్షలు విధించాయి.
పాకిస్తాన్‌లో సురక్షితంగా తలదాచుకున్న ఉగ్రవాదుల్లో మసూద్ అజర్ ఒక్కడే కాదు. మరో ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కూడా ఇస్లామాబాద్‌లో నివసిస్తోన్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పాక్ నుండి తన ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిర్ధారించింది.
-
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications