రూ.3.21కోట్లతో పట్టుబడ్డ జెట్‌ ఎయిర్‌వేస్ ఉద్యోగిని: ఏం జరుగుతోందంటే.?

Subscribe to Oneindia Telugu
పట్టుబడ్డ జెట్‌ ఎయిర్‌వేస్ ఉద్యోగిని, ఏం చేసిందంటే ? Video

న్యూఢిల్లీ: విమానయాన దిగ్గజ సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ మహిళా సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె రూ.3.21కోట్లు విలువ చేసే అమెరికా డాలర్లను అక్రమంగా తరలిస్తూ పట్టుడటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హాంగ్‌కాంగ్-ఢిల్లీ జెట్ ఎయిర్‌వేస్ విమాన సిబ్బంది అయిన ఆమెపై స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. ఆమె తరలిస్తున్న 4,80,200 డాలర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 విమానంలోనే అరెస్ట్

విమానంలోనే అరెస్ట్

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఢిల్లీ నుంచి హాంగ్‌కాంగ్ వెళ్లాల్సిన విమానంలో ఉన్న ఆమెను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు.

 స్మగ్లింగ్ కోసం విమాన సిబ్బందిని..

స్మగ్లింగ్ కోసం విమాన సిబ్బందిని..

నిందితురాలు ఢిల్లీలోని అమిత్ మల్హోత్రా అనే వ్యక్తితో కలిసి పనిచేస్తున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. అమిత్ స్మగ్లింగ్ కోసం విమాన సిబ్బందిని ఉపయోగించుకుంటాడని తమ విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు.

 అనుమానం రాకుండా..

అనుమానం రాకుండా..

ఎవరికీ అనుమానం రాకుండా విమాన సిబ్బంది ద్వారా డబ్బును విదేశాలకు పంపి అక్కడ బంగారం కొనుగోలు చేసి తిరిగి భారత్‌కు అక్రమంగా తీసుకొస్తారని చెప్పారు. ఆరేళ్ల క్రితం విమాన ప్రయాణంలో మల్హోత్రా ఈ జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగినిని పరిచయం చేసుకున్నాడని తెలిపారు.

 ప్రధాన నిందితుడి విచారణ

ప్రధాన నిందితుడి విచారణ

అంతేగాక, స్మగ్లింగ్‌లో జెట్ ఎయిర్‌వేస్ ఇతర సిబ్బంది పాత్రపైనా డీఆర్ఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగినితోపాటు మల్హోత్రాను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసులో లోతుగా దర్యాప్తు జరిపి, ఇతర సిబ్బంది పాత్రను తేలుస్తామని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Directorate of Revenue Intelligence (DRI) has arrested a Jet Airways employee at the Indira Gandhi International Airport for allegedly carrying US dollars worth Rs 3.21 crore.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి