పైలట్ నిద్ర, కోపైలట్ బిజీ: గాలిలో జారిన విమానం

విమానం టర్కీలోని అంకారా గగనతలంలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. విమానాలు బాగా దూరాలు వెళ్లేటప్పుడు పైలట్లకు నియంత్రితమైన విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్లు కాక్‌పిట్‌లోనే కాసేపు పడుకోవచ్చు. అయితే, ఆ సమయంలో కోపైలట్ అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఆమె ట్యాబ్‌లో బిజీగా ఉండి విమానం కిందికి దిగుతున్న విషయాన్ని గమనించలేదు.
ఆ సంఘటనపై జిడిసిఎ విచారణ జరపనుంది. ఈ విమానం 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి ఉంది. అయితే, 29 వేల అడుగుల ఎత్తులోనే ప్రయాణిస్తుండడంతో అంకారా ఎటిసి గుర్తించి, వెంటనే విమానానికి ప్రమాద హెచ్చరిక పంపించింది. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీని గురించి డిజిసిఎ జాయింట్ డిజి లలిత్ గుప్తాకు ఓ సందేశం కూడా వచ్చింది.
భద్రత తమకు అత్యంత ప్రధానమైందని, తమ అతిథులూ సిబ్బంది సంక్షేమానికి ప్రాముఖ్యం ఇస్తామని, భద్రత కోసం తగిన చర్యలను తాము ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని జెట్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి చెప్పారు.












Click it and Unblock the Notifications