Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మద్యం సీసాలపై ఓటు వేయాలని స్టిక్కర్లు, తీవ్ర విమర్శలు: నిర్ణయం వెనక్కి

భోపాల్: త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లలో ఓటు హక్కు పైన అవగాహన పెంచి, ఓట్ల శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా అధికారులు కొత్త ఆలోచన చేశారు. కానీ అధి వివాదాస్పదమైంది. దీంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల సాతాన్ని పెంచేందుకు జిల్లా యంత్రాంగం మద్యం సీసాల పైన ఓటర్లను చైతన్యపరిచే నినాదాలతో స్టిక్కర్లను అంటించింది. ఇందుకు సంబంధించిన స్టిక్కర్లను కొన్ని రోజుల క్రితమే స్థానిక మద్యం దుకాణదారులకు పంపిణీ చేశారు.

Jhabua: Voting message on liquor bottles sparks protest

స్టిక్కర్లను మద్యం సీసాలపై అతికించాల్సిందిగా దుకాణదారులను కోరింది. కానీ దీనిపై విమర్శలు వచ్చాయి. ఎన్నికల్లో మద్యాన్ని ప్రోత్సహిస్తారా అని దుమ్మెత్తి పోశారు. దీంతో అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

ఓటర్లను చైతన్యపరిచే చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుందని, అయితే అన్నిఅంశాలను పరిశీలించిన అనంతరం దీనిని వెనక్కి తీసుకున్నామని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 28వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+