వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 100 కోట్లు హెలికాప్టర్లలో తరలించారు

|
Google Oneindia TeluguNews

రాంచీ: రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చెయ్యడంతో ప్రజలు నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ప్రజలు కష్టాలు తీర్చడానికి భారత రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలు సమస్యలు తీర్చడం మాకు ముఖ్యం అంటూ రిజర్వ్ బ్యాంకు అధికారులు తెలిపారు.

జార్ఖండ్ లోని బొకారో స్టీల్ సిటీకి రాంచీలోని రిజర్వు బ్యాంకు నుంచి రెండు హెలికాప్టర్లు ద్వారా రూ.100 కోట్ల కొత్త రూ. 2,000, రూ.500 నోట్లు తరలించారు. అక్కడి ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కరించడానికి రిజర్వు బ్యాంకు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు.

Jharkhand airlifts Rs 100 cr form RBI at Patna

అసలు వాస్తవానికి అత్యవసర సమయంలో విపత్తుల సమయంలో హెలికాప్టర్లను ఉపయోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం కొత్త నోట్లు తీసుకోవడానికి ప్రజలు చాల ఇబ్బందులు పడటంతో రిజర్వు బ్యాంకు అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మా సమస్యలు వెంటనే గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నందుకు జార్ఖండ్ లోని బొకారో స్టీల్ సిటీ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రిజర్వు బ్యాంకు అధికారులు ధన్యవాదాలు తెలిపారు.

English summary
Two choppers were pressed into service to airlift currency from Patna RBI and rush it to centres like Jamshedpur and Bokaro for re-distribution in banks across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X