డిప్యూటీ సీఎంకు బిగ్ టాస్క్..!!

Jharkhand Assembly elections 2024: దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఫలితంగా ఈ రెండు చోట్లా రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటోన్నాయి అన్ని పార్టీలు.

మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.

Jharkhand Assembly elections 2024 Deputy CM Bhatti Vikramarka arrived in the Ranchi

నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.

ఈ ఎన్నికల కోసం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు భారీ టాస్క్ అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున సీనియర్ అబ్జర్వర్‌గా అపాయింట్ అయిన భట్టి.. శుక్రవారం రాత్రి రాంచీకి చేరుకున్నారు. బిర్సా ముండా విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.

Jharkhand Assembly elections 2024 Deputy CM Bhatti Vikramarka arrived in the Ranchi

అంతకుముందు ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేతో సమావేశం అయ్యారు. ఏఐసీసీ తరఫున జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సీనియర్ పరిశీలకుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఢిల్లీ నుంచి జార్ఖండ్‌కు బయలుదేరి వచ్చారు.

నేడు- రాంచీలో రాహుల్ గాంధీ నిర్వహించబోయే సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్లో పాల్గొంటారు భట్టి విక్రమార్క. రాంచీలోని శౌర్య స్టేడియంలో ఈ సభ ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ నుంచి రాంచీకి రానున్నారు రాహుల్ గాంధీ.

ఈ సభ అనంతరం భట్టి విక్రమార్క రెండు మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. అభ్యర్థుల ఎంపిక, జార్ఖండ్ ముక్తి మోర్చాతో పొత్తులు, సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలపై పార్టీ సీనియర్ నేతలతో చర్చిస్తారు. 2019 నాటి ఎన్నికల్లో జేఎంఎం- 41, కాంగ్రెస్- 33, రాష్ట్రీయ జనతాదళ్- 7 సీట్లల్లో పోటీ చేశాయి. అదే తరహాలో సీట్ల పంపకాలు ఉండొచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+