నంబర్ గేమ్ షురూ: అక్కడ అధికారం ఆ పార్టీదే

Jharkhand Assembly elecrtions 2024: దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఫలితంగా ఈ రెండు చోట్లా రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటోన్నాయి అన్ని పార్టీలు.

మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.

Jharkhand Assembly elections 2024 Janmat Polls predicts NDA will be came into power

నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ముందస్తు అంచనాలు వెలువడుతున్నాయి. అక్కడ ఏ కూటమి అధికారంలోకి రావొచ్చనే విషయాలపై ప్రముఖ సంస్థలన్నీ కూడా క్రమంగా తమ సర్వే నివేదికలను విడుదల చేస్తోన్నాయి. ఈ క్రమంలో తాజాగా జన్‌మత్ సంస్థ తన ఎన్నికల సర్వే వివరాలను బయటపెట్టింది.

దీని ప్రకారం చూసుకుంటే జార్ఖండ్‌లో కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియాకు ఎదురు దెబ్బ తప్పకపోవచ్చు. ఈ దఫా కూటమి ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతుంది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ విజయ పతాకాన్ని ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్డీఏకు 46 నుంచి 48 నియోజకవర్గాలు దక్కొచ్చని జన్‌‌మత్ సంస్థ అంచనా వేసింది. ఇండియా కూటమికి 28 నుంచి 30 సీట్లు లభిస్తాయని తెలిపింది. ఇతరులు నాలుగు నుంచి స్థానాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది. ఈ సర్వేలన్నీ ఎంత మాత్రం నిజమౌతాయనేది ఈ నెల 23వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో తేలిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+