వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jharkhand Assembly Elections Live: ముగిసిన తుది విడత పోలింగ్.. నేతల రాత బ్యాలెట్ బాక్సుల్లో..

|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ కు సర్వ సిద్ధమైంది. తుది దశలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి ఇప్పటిదాకా నాలుగు దశల్లో పోలింగ్ నిర్వహించారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండటం వల్లే కేంద్ర ఎన్నికల కమిషన్ అయిదు దశల్లో పోలింగ్‌ను ప్రకటించింది.

ప్రస్తుతం జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుంటామని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు విసిగిపోయారని, ఈ సారి తమకు పట్టం కడతారని కాంగ్రెస్ చెబుతోంది.

శుక్రవారం డిసెంబర్ 20వ తేదీన ఐదో విడుత ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. ఐదు విడతల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే పలు న్యూస్ ఛానెల్లు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించనున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఇతర మంత్రుల జాతకాలు బట్టబయలు కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి పట్ట కడుతారా? లేక కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించునున్నారా? అనే అంశం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో పోలింగ్, ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన లైవ్ అప్ డేట్స్ మీ కోసం..

Jharkhand Assembly Elections: All set to final phase polling in 16 Assembly constituencies on Friday

Newest First Oldest First
5:45 PM, 20 Dec

ముగిసిన తుది విడత పోలింగ్‌

ముగిసిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌
4:44 PM, 20 Dec

3 గంటల వరకు 62.77 శాతం

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 62.77 శాతం పోలింగ్ నమోదు
1:30 PM, 20 Dec

11 గంటల సమయానికి

11 గంటల సమయానికి
జార్ఖండ్ తుది విడత పోలింగ్‌లో 11 గంటల సమయానికి 28.24 శాతం ఓటింగ్ నమోదు
11:08 AM, 20 Dec

జార్ఖండ్‌లో కొనసాగుతున్న పోలింగ్... ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు
10:16 AM, 20 Dec

జార్ఖండ్ చివరి దశ పోలింగ్‌లో 9 గంటల సమయానికి 12.01శాతం పోలింగ్ నమోదు
9:28 AM, 20 Dec

జార్ఖండ్ అభివృద్ధి కోసం తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు తప్పనిసరిగా వచ్చి ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాను: సీఎం రఘుబర్ దాస్
9:26 AM, 20 Dec

జార్ఖండ్ చివరిదశ పోలింగ్ సందర్భంగా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోడీ పిలుపు
9:19 AM, 20 Dec

జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేసే 52 అభ్యర్థులపై మర్డర్ అటెంప్ట్ కేసులు (ఐపీసీ సెక్షన్ 307) ఉన్నాయి.
9:19 AM, 20 Dec

జార్ఖండ్ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల్లో 13 మందిపై మర్డర్ కేసులు (ఐపీసీ సెక్షన్ 302) ఉన్నాయి.
9:18 AM, 20 Dec

24 అభ్యర్థులు మహిళలపై దాడి చేసినట్టు, అత్యాచారం చేసినట్టు ఆరోపణలు (ఐపీసీ సెక్షన్ 376) ఎదుర్కొంటున్నారు
9:02 AM, 20 Dec

జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 10 మందిపై కిడ్నాప్ కేసులు ఉన్నాయి.
8:49 AM, 20 Dec

భారీ భద్రత మధ్య

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత భారీ భద్రత మధ్య ప్రారంభమైన పోలింగ్
8:33 AM, 20 Dec

జేఎంఎం గెలుపు కోసం

జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ అధ్యక్షుడు శిబు సోరెన్, ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ ప్రచారం చేశారు.
8:22 AM, 20 Dec

అధికారం కోసం బీజేపీ

బీజేపీ తరఫున ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ జేపీ నడ్డా తదితరులు ప్రచారం చేశారు.
8:18 AM, 20 Dec

గెలుపు కోసం ప్రియాంక గాంధీ

గెలుపు కోసం ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ, చత్తీస్‌గఢ్ సీఎం భూపేస్ భాగేల్, సినీ నటుడు శతృఘ్న సిన్హా ప్రచారం నిర్వహించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించారు.
8:17 AM, 20 Dec

జామా బరిలో సోరెన్ కోడలు

జామా సిట్ నుంచి శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్ బరిలో ఉన్నారు.
7:52 AM, 20 Dec

పోలింగ్ ప్రారంభం

జార్ఖండ్‌లో 5వ విడత పోలింగ్ మొదలైంది. పకూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటర్లు బారుల తీరి ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. ఈ విడతలో మొత్తం 16 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతున్నది.
11:45 PM, 19 Dec

డిసెంబర్ 23వ తేదీన ఫలితాలు

నాలుగు దశల్లో 65 సీట్లుకు పోలింగ్ జరుగగా, ఐదో విడుతగా 16 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 81 సీట్లకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 23వ తేదీన వెల్లడి కానున్నది.
11:41 PM, 19 Dec

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
జార్ఖండ్ తుది విడుత ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
11:40 PM, 19 Dec

మధ్యాహ్నం 3 గంటల వరకే

మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న బొరియో, బర్హయిట్, లితిపారా, మహేష్ పూర్, శికారిపారా నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకే ఉంటుంది.
11:40 PM, 19 Dec

మాజీ సీఎం, మంత్రుల భవితవ్యం

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సహా ఇద్దరు మంత్రుల భవితవ్యం కూడా చివరి విడత పోలింగ్ లోనే ఖరారు కాబోతోంది.
11:39 PM, 19 Dec

40 వేల మంది సాయుధ బలగాలను

ఇప్పటి వరకు జార్ఖండ్‌లో నాలుగు దశల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో తుది దశ ఎన్నికలను కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి 40 వేల మంది సాయుధ బలగాలను పోలింగ్ కేంద్రాల వద్ద మోహరింపజేశారు.

English summary
Ranchi: Campaigning in 16 assembly constituencies ended on Wednesday as the fifth and final phase of polling in Jharkhand will be held on December 20. Over 40,000 security personnel have been deployed in the these assembly constituencies spread over six districts to ensure free, fair and peaceful polling, Election Commission officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X