జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ మృతి..

భారత రాజకీయాల్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 81 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఢిల్లీ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈరోజు ( 2025 ఆగస్టు 4 ) తుదిశ్వాస విడిచారు.

ముక్తిమోర్చా స్థాపకుడిగా..

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో శిబూ సోరెన్‌ పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది. ఆదివాసీ హక్కుల కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. 1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు.

jharkhand-ex-cm-shibu-soren-passed-away-due-to-health-issues

దిశోమ్ గురు..

ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న ఆయనను.. "దిశోమ్ గురు" అనే బిరుదుతో గౌరవంగా పిలిచేవారు.

మూడుసార్లు ముఖ్యమంత్రి..

శిబూ సోరెన్ మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అలానే కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. పార్లమెంట్ సభ్యునిగా ఎనిమిదికి పైగా టర్మ్‌లు ఆయన ఎన్నిక కావడం గమనార్హం. ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

జాతీయ నేతల సంతాపం..

శిబూ సోరెన్‌ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రాంతీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. "ఆయన మరణం దేశానికి తీరనిలోటు" అని పలువురు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+