తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి, కొడుకు పేరు మోసిన గ్యాంగ్ స్టర్

Posted By:
Subscribe to Oneindia Telugu

జంషెడ్ పూర్: తండ్రి పోలీసు అధికారి, ఆయన పోలీస్ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు.కాని, కొడుకు మాత్రం ఘరానా రికార్డులున్న నేరగాడిగా మారాడు. ఆయనపై ఆరు రాష్ట్రాల్లో కేసులున్నాయి. పైగా 50 కోట్లరూపాయాలను సంపాదించాడు.

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అఖిలేష్ సింగ్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఆయన నేర చరిత్ర చూస్తే స్థానికులు భయబ్రాంతులు చెందుతారు.35 ఏళ్ళ అఖిలేష్ సింగ్, జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ చూడటానికి పొడవుగా అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు. కానీ, చేతలు మాత్రం దుర్మార్గంగా ఉంటాయి.

2002 లో జంషెడ్ పూర్ లో జైలర్ ఉమాశంకర్ పాండేను హత్య చేశాక అఖిలేష్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అతనికి జీవితకాలంపాటు జైలు శిక్ష పడింది.

 Jharkhand former cop’s son is a rich gangster with assets worth Rs 50 crore

ఇద్దరు పోలీసులు, శత్రువులపై ఆయన దాడి చేశారు. తన మనుషుల ద్వారా జంషెడ్ పూర్ తో పాటు ఇతర నగరాల్లోకి వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయించాడు. గత ఏడాది బెయిల్ వచ్చాక పారిపోయాడు.

ఇటీవలే కోర్టు ఆవరణలోనే వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు ఉపేంద్రసింగ్ ను హత్య చేయించాడని ఆరోపణలున్నాయి.అతనిపై ఇంకా జార్ఖండ్ , బీహర్, ఉత్తర్ ప్రదేశ్ లో కేసులు నమోదయ్యాయి.

అఖిలేష్ పేరిట 17 నకిలీ పాన్ కార్డులు, 14 ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులున్నాయి. జార్ఖండ్ , ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లో స్థిరాస్తులున్నాయి. పోలీసులు ఇటీవల జంషెడ్ పూర్ లోనే అఖిలేష్ ప్లాట్ పై దాడిచేసినప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగుచూసినట్టు పోలీసులు తెలిపారు.

అతని ఆస్తులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆస్తులన్నీ మారుపేర్లతో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టికి తీసుకెళ్ళి విచారణ జరిపించాల్సిందిగా కోరనున్నట్టు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
From a policeman’s son to one of eastern India’s dreaded gangsters, Akhilesh Singh has come a long way in the crime world amassing huge manpower and riches.
Please Wait while comments are loading...