నాకే తెలియదు, ఎలా లీకైంది: జియాఖాన్ కేసుపై జడ్జి
న్యూఢిల్లీ: ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం నాడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాఫ్తు అధికారుల పైన ఒకింత అసహనం వ్యక్తం చేసింది. జియాఖాన్ మృతి కేసులో ఛార్జీషీటులో ఉన్న వివరాలు లీక్ కావడంపై ప్రత్యేక న్యాయస్థానం సిబిఐని ప్రశ్నించింది.
జియాఖాన్ మృతి కేసులో ఛార్జీషీటులోని కొన్ని వివరాలు లీక్ కావడంపై స్పందిస్తూ... ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రెండు రోజుల క్రితం సిబిఐ కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది. అందులో సూరజ్ పంచోలీని నిందితుడిగా చేర్చింది.
శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. సూరజ్ పంచోలీ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది. సూరజ్ పంచోలీ ఛార్జీషీట్ తీసుకున్నారు.

కాగా, విచారణ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ... ఛార్జీషీటులోని కొన్ని వివరాలు తనకు తెలియక ముందే మీడియాకు ఎలా తెలిశాయని అసహనం వ్యక్తం చేశారు. ఇది కేవలం సిబిఐ వద్దే ఉందని, కేవలం వారే కారణమని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. మరోసారి ఇలాంటిది జరగకుండా చూసుకోవాలన్నారు.
కోర్టు బయట జియాఖాన్ తల్లి రబియా ఖాన్ మాట్లాడుతూ... ఛార్జీషీటు పట్ల తాము అసంతప్తిగా ఉన్నామని చెప్పారు. మరింత బయటకు రావాల్సి ఉందన్నారు. కాగా, ఛార్జీషీటులోని కొన్ని అంశాలు గురువారం వెలుగు చూసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications