షాకింగ్: నిలిచిపోయిన జియో ఫోన్ బుకింగ్స్! 36 గంటల్లోనే కోటి ఫోన్లు, ఎప్పుడిస్తారో?
రిలయన్స్ జియో ఫోన్ బుకింగ్ కు స్పందన ఏ స్థాయిలో వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే బుకింగ్స్ ప్రారంభించిన 36 గంటలకే బుకింగ్స్ ను నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే కోటికి పైగా ఫోన్లు
ముంబై: రిలయన్స్ జియో ఫోన్‌కు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఆగస్టు 24వ తేదీ ఆన్‌లైన్‌లో బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వెబ్‌సైట్ క్రాష్ అయ్యేంత అనూహ్య స్పందన వెల్లువెత్తింది.
ఒక్కరోజులోనే ఈ ఫోన్ 30 లక్షల మార్కును క్రాస్ చేసింది. అయితే ప్రస్తుతం జియో ఫోన్ బుకింగ్స్‌ను నిలిపివేసినట్టు కంపెనీ తెలిసింది. జియో సైట్‌లో ప్రీ-బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లుగా ఒక ప్రకటన కనిపిస్తోంది.

ఇప్పుడు జియో ఫోన్ కావాలనుకునే వారు కేవలం తమ ఆసక్తిని మాత్రమే రిజిస్టర్ చేసుకోడంటూ రిలయన్స్ పేర్కొంది. ప్రీ-బుకింగ్స్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ తర్వాత తెలుపుతామంటూ జియో సైట్‌లో తెలిపింది. తాత్కాలికంగా బుకింగ్ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్టు పేర్కొంది.
'' థాంక్యూ ఇండియా! లక్షల మంది జియో ఫోన్‌ను బుక్ చేసుకున్నారు'' అని జియో.కామ్ తన వెబ్ సైట్ హోమ్ పేజీలో కంపెనీ బ్యానర్‌గా ఈ విషయాన్ని తెలిపింది. జియో అకస్మాత్తుగా ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను నిలిపివేయడంతో, తర్వాత బుక్ చేసుకోవచ్చని భావించిన ప్రజలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు.
జియో 4G ఫీచర్ ఫోన్ బుకింగ్స్ ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమై, 26వ తేదీ ఉదయం వరకు కొనసాగాయి. అంటే 36 గంటలు మాత్రమే ఈ బుకింగ్స్‌కు అనుమతి ఇచ్చింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే కోటి ఫోన్లు బుక్ అయినట్టు తెలుస్తోంది.
జియో ఫోన్‌ను ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి సెప్టెంబర్‌లో అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే సెప్టెంబర్‌లో ఏ తేదీన ఫోన్ల డెలివరీ ఉంటుందో, ఏ స్టోర్ నుంచి ఫోన్‌ను కలెక్ట్ చేసుకోవాలో తెలుపుతూ రిలయన్స్ జియో ఫోన్ బుక్ చేసుకున్న వారికి ఒక మెసేజ్ పంపనుందట.












Click it and Unblock the Notifications