వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా వాళ్లకు ప్రాణహానీ, బండారం బయటపెడ్తా: నితీష్‌పై మాంఝీ సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలకు, తనకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జీతన్ రామ్ మాంఝీ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలకు బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు. తనను తన పని సరిగా చేసుకోనీయలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత నితీష్ కుమార్‌ను భీష్ముడితో పోల్చారు. తనను ఏ పని చేసుకోనీయలేదన్నారు.

తనకు 140 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. విశ్వాస పరీక్ష సమయంలో రహస్య బ్యాలెట్ పెడితే తనకు 140 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతారని చెప్పారు. ఈ ఘటనల పైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మౌనంగా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. విస్తృత అవినీతి ఉందన్నారు. తనకు ఏ కారణం చెప్పకుండా శరద్ యాదవ్ తప్పుకోవాలని చెప్పారని మండిపడ్డారు.

jitan Ram Manjhi alleges death threat to supporting MLAs, says still has majority

ఇప్పటి వరకు ప్రతిపక్షంలో బీజేపీ ఉండగా, సభాపతి ఇప్పుడు కొత్త పేరును ప్రతిపక్ష నేతగా తెరపైకి తీసుకు వచ్చారని విమర్శించారు. అంతేకాకుండా, తనకు మద్దతుగా ఉన్న జేడీయు ఎమ్మెల్యేల పేర్లు లేవని, తద్వారా వారు తనకు ఓటు వేయకుండా పోవాల్సి ఉంటుందని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలకు బెదిరింపు సందేశాలు వచ్చాయని చెప్పారు. తనకు ఓటేస్తే బాగుండదని వారికి మెసేజ్‌లు చేశారన్నారు. సభాపతి తీరు కూడా తమకు అనుమానంగా ఉందన్నారు.

తాను గవర్నర్‌ను కలిశానని, రహస్య బ్యాలెట్ పేపర్ పెట్టాలని కోరానని చెప్పారు. రహస్య బ్యాలెట్ పెట్టకుంటే తమ ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని చెప్పారు. అంతేకాకుండా, అవిశ్వాసం సమయంలో కొందరు జేడీయు ఎమ్మెల్యేలు (నితీష్ మద్దతుదారులు) అసెంబ్లీలో గందరగోళం సృష్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్నారు. వీటన్నింటిని చూసే తాను రాజీనామా చేశానని చెప్పారు. ఇప్పటికీ తనకు మెజార్టీ ఉందన్నారు.

తాను దళిత బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చానని, తనకు పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు పరిధులు విధించిన సందర్భాలు ఉన్నాయని జేడీయూ ముఖ్య నేతల పైన ఆరోపించారు. చాలా కుంభకోణాలు ఉన్నాయని, తనకు మరింత సమయం ఉంటే వాటిని అన్నింటిని బయటపెడతానని హెచ్చరించారు.

మరోవైపు అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది.

English summary
itan Ram Manjhi alleges death threat to supporting MLAs, says still has majority
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X