నితీష్ ఎఫెక్ట్: బిజెపితో జితన్ రామ్ మంఝీ తెగదెంపులు

న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ ఆవామ్ మోర్చా బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎతో తెగదెంపులు చేసుకుంది. కాంగ్రెసు నేతృత్వంలో బీహార్‌లో కాంగ్రెసు,రాష్ట్రీయ జనతాదళ్ కూటమి మహా ఘట్ బంధన్‌లో చేరాలని నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెసు, ఆర్జెడీ కూటమిలో చేరే విషయంపై మంఝీ గురువారం ఉదయం పది గంటలకు పాట్నాలో లాంఛనంగా ప్రకటిస్తారు.ఆయన బుధవారంనాడు ఆర్జెడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌‌ను కలిశారు.

తేజస్వీ యాదవ్‌తో భేటీ

తేజస్వీ యాదవ్‌తో భేటీ

బీహర్ మహా ఘట్ బంధన్‌లో చేరుతానని ఆయన తేజస్వీ యాదవ్‌తో చెప్పారు. ఈ సమావేశంలో ఆర్జెడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహిత అనుచరుడు భోలా యాదవ్, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

మంఝీకి బిజెపి మొండిచేయి

మంఝీకి బిజెపి మొండిచేయి

మంఝీ ఎన్డీఎ నుంచి వైదొలగి ఆర్జెడీతో కలిసి పనిచేస్తారని ఆర్జెడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ కొద్ది రోజుల క్రితం చెప్పారు. బీహార్ నుంచి తమకు ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని మంఝీ చేసిన విజ్ఞప్తిని బిజెపి తోసి పుచ్చింది.

బిజెపికి మంఝీ హెచ్చరిక

బిజెపికి మంఝీ హెచ్చరిక

బీహార్‌లో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తమకు కనీసం ఒక్క సీటైనా ఇవ్వాలని లేదంటే ఎన్డీఎ నుంచి వైదొలుగుతానని మంఝీ బిజెపికి చెప్పారు. అంతేకాకుండా ఆరారీయ లోకసభకు, జహనాబాద్, భభువా అసెంబ్లీ స్థానాలకు మార్చి 11వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో ఎన్డీఎకు మద్దతు ఇవ్వబోనని హెచ్చరించారు.

నితీష్ కుమార్ ఇలా..

నితీష్ కుమార్ ఇలా..

జనతాదళ్ యునైటెడ్ నుంచి మంఝీ 2015 మార్చిలో వైదొలిగారు. ఆ తర్వాత హెచ్ఎఎంను ఏర్పాటు చేశారు. ఆయనను నితీష్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నితీష్ కుమార్‌ను, జెడి (యు) తప్పిదాలను బయటపెడుతానని ఆయన హెచ్చరించారు. (

నితీష్ కుమార్ మళ్లీ

నితీష్ కుమార్ మళ్లీ

నితీష్ కుమార్ ఎన్డీఎలో తిరిగి చేరారు. ఆయన 2017 ఏప్రిల్‌లో ఎన్డీఎలో చేరారు. అయినా మంఝీ ఎన్డీఎలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఎన్డీఎలో ఆయన ప్రాధాన్యం తగ్గింది. ఈ నేపథ్యంలో బిజెపి మంఝీ డిమాండ్‌ను తోసిపుచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+