విద్యార్థి నాపై అత్యాచారం చేశాడు: మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్‌డి విద్యార్థిపై ఫిర్యాదు చేశారు. అతను తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. కోర్సులో తాను మార్దదర్శకత్వం వహిస్తున్న క్రమంలో అతను తనతో స్నేహం పెంచుకున్నాడని, అలా తనకు దగ్గరై విశ్వవిద్యాలయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.
పిహెచ్‌డి విద్యార్థి మునిరికాలోని అద్దె ఫ్లాట్‌లో నివసిస్తున్నాడని, తరుచుగా పర్యవేక్షణ నిమిత్తం తన వద్దకు వస్తూ ఉండేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. ఈ క్రమంలో తమ మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని, తనను పెళ్లి చేసుకుంటానని అతను హామీ ఇచ్చాడని కూడా ఆమె పోలీసులకు చెప్పారు.

గత కొద్ది రోజులుగా అతను మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు దూరంగా ఉంటున్నాడు. ఆమెను కలుసుకోవడం లేదు. తనను పెళ్లి చేసుకోవడానికి అతను నిరాకరిస్తున్నాడని ఆమె ఆరోపించారు. తన పట్ల వైముఖ్యం ప్రదర్శిస్తూ వస్తున్నాడని కూడా ఆమె చెప్పింది.
మహిళను వైద్య పరీక్షలకు నిమిత్తం పంపించారు. ఆ తర్వాత యువకుడిపై కేసు నమోదు చేశారు. అతన్ని విచారణ నిమిత్తం పోలీసులు పిలిపించారు. అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications