వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మరక్షణలో శశికళ: షాక్ మీద షాక్, అడిగితే నో చెప్పిన ఎమ్మెల్యేలు

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు వెళ్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు వెళ్తున్నారు.

<br>శశికళ కోసం రంగంలోకి సుబ్రహ్మణ్య స్వామి, బ్యాక్ డోర్ నుంచి జంప్!
శశికళ కోసం రంగంలోకి సుబ్రహ్మణ్య స్వామి, బ్యాక్ డోర్ నుంచి జంప్!

తాజాగా మరికొంతమంది ఎమ్మెల్యేలు పన్నీరుతో జత కలిశారు. మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు పన్నీరు పక్కన చేరారు. ఎంపీలు సెంగుత్తువన్, జయసింగ్‌లు ఆదివారం పన్నీరు నివాసానికి చేరుకున్నారు. ఆయనకు మద్దతు ప్రకటించారు.

ఆత్మరక్షణలో శశికళ: షాక్ మీద షాక్, అడిగితే నో చెప్పిన ఎమ్మెల్యేలు

ఆత్మరక్షణలో శశికళ: షాక్ మీద షాక్, అడిగితే నో చెప్పిన ఎమ్మెల్యేలు

కాగా, తమిళనాడులో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. గోల్డెన్ బే రిసార్ట్‌ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కళ్లుగప్పి పన్నీరు వర్గంలో చేరడంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎవరి వైపు ఎంత మంది ఉంటారో లెక్కతేలడం లేదు.

పన్నీరు వర్గంలోకి..

పన్నీరు వర్గంలోకి..

ఇప్పటికే శశికళ వర్గం నుంచి పలువురు ఎమ్మెల్యేలు గోడ దూకి పన్నీరు వర్గంలో చేరారు. దీంతో శశికళ రక్షణలో పడ్డారు. తన వెంట ఉన్న ఎమ్మెల్యేలు జారిపోకుండా ప్రత్యేక గదృష్టి పెట్టారు.

హడవిడిగా రిసార్టుకు చిన్నమ్మ

హడవిడిగా రిసార్టుకు చిన్నమ్మ

అందుకే నిన్న చిన్నమ్మ హడావుడిగా గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లి ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. నిర్ణయం తనకే అనుకూలంగా వస్తుందని, ఎవరూ పక్క చూపులు చూడొద్దని ఆమె సూచించారు. అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు ఆమె మాటలను కొట్టి పారేశారట.

వెళ్లిపోతామని ఎమ్మెల్యేలు

వెళ్లిపోతామని ఎమ్మెల్యేలు

తాము వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని, రిసార్ట్ నుంచి బయటకు అనుమతించాలని కోరారని తెలుస్తోంది. వారిని బుజ్జగించేందుకు శశికళ నానా తంటాలు పడుతున్నారని సమాచారం.

ప్రత్యక్షంగా శశికళ డీల్

ప్రత్యక్షంగా శశికళ డీల్

మొదట ఇంటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలతో మాట్లాడాలని భావించిన శశికళ, పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో ప్రత్యక్షంగా డీల్ చేశారు. శశికళ వర్గం నుంచి ఒక్కరొక్కరు నేతలు వెళ్లిపోతున్నారు.

సంతకానికి నో చెప్పిన పలువురు ఎమ్మెల్యేలు

సంతకానికి నో చెప్పిన పలువురు ఎమ్మెల్యేలు


గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను స్వచ్చందంగా ఇక్కడ ఉన్నట్లు డిక్లరేషన్ ఇస్తూ సంతకం చేయాల్సిందిగా శశికళ కోరారు. సగం మంది ఎమ్మెల్యేలు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో చేసేదేమీ లేక శశికళ అక్కడ నుంచి వెనుదిరిగారు.

డైలమాలో శశికళ

డైలమాలో శశికళ

మొన్నటి వరకు ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని ధైర్యంగా ఉన్న శశికళ ఇప్పుడు డైలమాలో పడ్డారు. గవర్నర్ జాప్యం చేయడమే ఇందుకు కారణంగా భావిస్తూ ఆమె నిరసన తెలుపుతూ ఓ లేఖ కూడా రాశారు.

ఈరోడ్ మేయర్

ఈరోడ్ మేయర్

ఈరోడ్ మేయర్ మళ్లికా పరమశివమ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు తన మద్దతును ప్రకటించారు. ఆదివారం నాడు ఆమె పన్నీరు సెల్వంను ఆయన నివాసంలో కలిసి మద్దతిస్తున్నట్లు తెలిపారు.

English summary
Jolt for Sasikala as rural industries minister P Benjamin and two more MPs join Chief Minister Panneerselvam camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X