విలేకరి తల్లిని చంపేసిన పోలీసులు (వీడియో)
లక్నో: లంచం ఇవ్వడానికి నిరాకరించిన మహిళకు ఇద్దరు పోలీసులు పోలీస్ స్టేషన్ ముందే నిప్పంటించడంతో ఆమె మరణించిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలోని కోతి పోలీస్ స్టేషన్ లో జరిగింది. పోలీసుల చేతిలో హత్యకు గురైయ్యింది ఒక విలేకరి తల్లి.
నీతు ద్వివేది (40) అనే మహిళ పోలీసుల కిరాతకత్వానికి బలి అయ్యారు. నీతు కుమారుడు ఒక హిందీ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్నాడు. నీతు భర్త రామ్ నారాయణ్ ను కోతి పోలీసులు ఒక తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నించారు. ఆయనను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు.

విషయం తెలుసుకున్న నీతు పోలీస్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తన భర్తను వదిలిపెట్టాలని పోలీసులకు చెప్పారు. అందుకు పోలీసులు రూ. ఒక లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు విలేకరి అని చెప్పినా వారు పట్టించుకోలేదు. చివరికి నీతును స్టేషన్ భవనం ముందుకు లాగి కిరోసిన్ పోసి నిప్పంటించారు.
తీవ్రగాయాలైన ఆమెను లక్నో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చికిత్స విఫలమై మంగళవారం వేకువ జామున నీతు మరణించారు. నీతు మరణించక ముందు పోలీసులు ప్రవర్తించిన తీరు గురించి న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. విలేకరులకు, వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తామని, ఇద్దరు పోలీసులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ అబ్దుల్ హమీద్ తెలిపారు.












Click it and Unblock the Notifications