వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్టును లారీతో తొక్కించేశారు: సిట్ దర్యాప్తునకు ఆదేశం(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

జర్నలిస్టును లారీ తొక్కించేశారు: సిట్ దర్యాప్తునకు ఆదేశం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఇసుక మాఫియాపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నజర్నలిస్టు రోడ్డు లారీ ప్రమాదంలో మృతి చెందడం కలకలం రేపుతోంది. సహచర పాత్రికేయులు, విపక్షాలు ఇది హత్యేనని ఆరోపణలు చేస్తున్నాయి.

సందీప్‌శర్మ అనే పాత్రికేయుడు బింద్‌ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై వరుస కథనాలు రాస్తున్నారు. ఈ అవినీతిలో ఉన్న ప్రజాప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు.

 Journalist Sandeep Sharma crushed by truck: MP Police constitutes SIT

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్‌ అక్కణ్నుంచి వెంటనే పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు సందీప్‌ను ఆసుపత్రికి తరలించగా..అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.

తొలుత దీన్ని రొడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని సందీప్‌ కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే సందీప్‌ మృతిపై పాత్రికేయ సంఘాలతో పాటు విపక్షాల నుంచి పెద్దఎత్తున ఆందోళన చెలరేగడంతో ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసినట్లు మధ్యప్రదేశ్‌ పోలీసులు తెలిపారు.

English summary
The Madhya Pradesh Police on Monday set up a Special Investigation Team (SIT) to probe journalist Sandeep Sharma's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X