మహాకుంభ మేళా తొక్కిసలాటపై న్యాయ విచారణ, మృతుల కుటుంబాలకు పరిహారం

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగానికి ఓ పాఠం లాంటిందన్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై నివేదిక సమర్పించాలని కుంభమేళా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఈ తొక్కిసలా ఘటన తన హృదయాన్ని ద్రవింపజేసిందంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన హృదయ విదారకంగా ఉంది. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్​ ఏర్పాటు చేశాం. గత రాత్రి నుంచి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.

Judicial inquiry into the Maha Kumbh Mela stampede Rs 25 lakh compensation to the families of the deceased

కుంభమేళా అథారిటీ, పోలీస్​, పరిపాలనా యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలు.. తాము చేయగలిగేవన్నీ చేస్తున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు.

తొక్కిసలాటలో 30 మంది మృతి

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి వివరాలను డీఐజీ బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్య ఒకటిరెండు చోట్ల తొక్కిసలాట జరిగిందన్నారు. బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.

మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించామని తెలిపిన డీఐజీ.. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందన్నారు. తొక్కిసలా ఘటనలో 60 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వీరిలో చాలా మంది పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

బుధవారం రోజున కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించలేదని వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 1920ను సంప్రదించాలని డీఐజీ వైభవ్ కృష్ణ సూచించారు.

కాగా, మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. గాయపడివారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.

మౌనీఅమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చినట్లు చెప్పారు. అయితే, మౌనీ అమావాస్య సందర్భంగా అమృతస్నానాల కోసం 12 కి.మీ.పరిధిలో యూపీ సర్కారు అనేక ఘాట్లను ఏర్పాటు చేసింది. అయినప్పటకీ ఎక్కువ మంది భక్తులు త్రివేణి సంగమం సంగం ఘాట్‌కు చేరుకోవటంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+