‘సీజేఐ పవర్స్’ వ్యాజ్యంపై విచారణ చేపట్టలేను, 24గం.ల్లోనే రివర్స్: జస్టిస్ చలమేశ్వర్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అధికారాలను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తిరస్కరించారు. కేసుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని ఈ పిల్‌ను శాంతిభూషణ్‌ అనే వ్యక్తి దాఖలు చేశారు.

అయితే దీనిపై జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ విచారణ చేపట్టలేనంటూ స్పష్టం చేశారు.
మార్గదర్శకాలు ఇచ్చి తర్వాత 24 గంటల్లోనే వాటిని రద్దు చేసే అవకాశం మరోసారి ఇవ్వబోనని జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. ఏదో కార్యాలయాన్ని అధిరోహించడం కోసం తాను యత్నిస్తున్నట్లు కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

 Justice Chelameswar refuses to hear plea on CJI powers, says order will be reversed in 24 hours

మరో రెండు నెలల్లో రిటైర్‌ అవుతాననగా ఇలాంటి వార్తలు రావడం బాధగా ఉందని అన్నారు. ఇలాంటి ఆరోపణలతో తాను రిటైర్ కావాలనుకోవడం లేదని చెప్పారు. కాగా, తన తండ్రి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టాల్సిందిగా ఆయన కుమారుడు ప్రశాంత్‌భూషణ్‌.. చలమేశ్వర్‌ ధర్మసనాన్ని కోరారు. ఆయన నిరాకరించడంతో ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు.

కాగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు, రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటుపై చలమేశ్వర్‌ అసంతృప్తితో ఉన్నారు. జనవరి 12న ఇదే అంశంపై సీనియర్‌ న్యాయమూర్తులతో కలిసి ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Justice Jasti Chelameswar today refused to hear the plea challenging the powers of Chief Justice of India as Master of the Roster.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X