సౌమ్య రేప్ కేసు: వెనక్కి తగ్గిన కట్జూ, క్షమాపణ..
సౌమ్య కేసులో న్యాయస్థానం తీర్పును తాను ధిక్కరించడం పట్ల మార్కండేయ కట్జూ బేషరతుగా క్షమాపణ తెలియజేశారు.
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన సౌమ్య హత్యాచారం కేసులో వివాదస్పద రీతిలో స్పందించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. సౌమ్య కేసులో న్యాయస్థానం తీర్పును తాను ధిక్కరించడం పట్ల బేషరతుగా క్షమాపణ తెలియజేశారు.
కట్జూ క్షమాపణలతో సుప్రీం ఆయనపై చర్యలను నిలిపివేసింది. కాగా, సౌమ్య కేసులో నిందితుడైన గోవిందచామికి కేరళ హైకోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్షగా కుదించడంతో కట్జూ దాన్ని ధిక్కరించారు. సెక్షన్-300ని పూర్తిగా విచారించకుండానే సుప్రీం తీవ్ర తప్పిదం చేసిందని, మరణశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించడం న్యాయవ్యవస్థలో జరిగిన అతిపెద్ద తప్పు అని కట్జూ తన బ్లాగులో అభిప్రాయపడ్డారు.

దీనిపై బహిరంగ కోర్టులో విచారణ జరిపించాలని కూడా కట్జూ డిమాండ్ చేశారు. దీంతో కట్జూకు సుప్రీం నోటీసులు పంపించింది. సుప్రీం తీర్పును కట్జూ తప్పుబట్టడాన్ని న్యాయమూర్తి గోగోయ్ వ్యతిరేకించారు. సెక్షన్-300 క్షుణ్ణంగా పరిశీలించాకే తీర్పు వెలువరించామని సుప్రీం తెలిపింది.
సుప్రీం నోటీసులపై కూడా అప్పట్లో ఘాటుగానే స్పందిన కట్జూ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. తాజాగా తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కట్జూ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కట్జూ క్షమాపణను పరిగణలోకి తీసుకున్న సుప్రీం.. కట్జూపై ఇక ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications