భారత తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పీసీ ఘోష్...ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా లోక్‌పాల్ ఏర్పాటు అయ్యింది. అవినీతికి అడ్డుకట్టు వేసేందుకు లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు లోక్‌పాల్ తొలి ఛీఫ్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ పినాకి చంద్రఘోష్‌ను నియమించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.ఇక లోక్‌పాల్‌లో జ్యుడిషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బీ భోసలే, జస్టిస్ పీకే మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ ఏకే త్రిపాఠీలను రాష్ట్రపతి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దినేష్ కుమార్ జైన్, అర్చన రామసుందరం, మహేంద్ర సింగ్, ఐపీ గౌతమ్‌లను సభ్యులుగా అప్పాయింట్ చేశారు రామ్‌నాథ్ కోవింద్.

2014 జనవరి 16న లోక్‌పాల్ చట్టం నోటిఫై చేసిన ఐదేళ్ల తర్వాత లోక్‌పాల్ ఛీఫ్‌గా జస్టిస్ పీసీ ఘోష్‌ను నియమించడం విశేషం. ఇక లోక్‌పాల్ అవినీతిపై కొరడా ఝుళిపిస్తుంది. ఇందులో ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు ఛైర్మెన్, ఒకరు జ్యుడిషియల్ సభ్యులు మరొకరు నాన్-జ్యుడిషియల్ సభ్యులుగా ఉంటారు. లోక్‌పాల్‌లో మొత్తం 8 మంది సభ్యులు ఉంటారు. ఇందులో హైకోర్టు మాజీ జడ్జీలు, మాజీ సివిల్ సర్వీసెస్ అధికారులు ఉంటారు.
President of India appoints Justice Dilip B Bhosale, Justice P K Mohanty, Justice Abhilasha Kumari and Justice AK Tripathi as judicial members. Dinesh Kumar Jain, Archana Ramasundaram, Mahender Singh, and Dr. IP Gautam appointed members. https://t.co/46XgM5XQTU
— ANI (@ANI) March 19, 2019
ప్రభుత్వ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్రంలో అయితే లోక్‌పాల్ విచారణ చేస్తుంది అదే రాష్ట్రంలో అయితే లోకాయుక్తాలు విచారణ చేస్తాయి. మార్చి 17న ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, ప్రముఖ జ్యూరీ సభ్యులు ముకుల్ రోహత్గీలు సమావేశమై జస్టిస్ పీసీ ఘోష్‌ను లోక్‌పాల్‌కు పేరును ప్రతిపాదించారు. అయితే ఈ సమావేశానికి విపక్షనేత మల్లికార్జున ఖర్గే హాజరు కాలేదు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications