సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణం- కొత్త బెంచ్ ల ఏర్పాటుకు హామీ

దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ ఈ బాధ్యతలు స్వీకరించారు.

జస్టిస్ సూర్యకాంత్ స్వరాష్ట్రం.. హర్యానా. 1962 ఫిబ్రవరి 10న హిస్సార్‌లో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు అంటే సుమారు 15 నెలల పాటు ఆయన సీజేఐగా కొనసాగుతారు. న్యాయ వృత్తిలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం, ఆర్టికల్ 370 రద్దు వంటి అనేక కీలక అంశాలపై చారిత్రాత్మక తీర్పులు ఇచ్చారు.

Justice Surya Kant Sworn In as India s 53rd Chief Justice

1984లో హిస్సార్‌లో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2000 సంవత్సరంలో హర్యానా అడ్వొకేట్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్రానికి అతి పిన్న వయస్కుడైన ఏజీగా గుర్తింపు పొందారు. 2001లో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2004లో పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2019 మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2024 నవంబర్ నుంచి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందు జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. న్యాయవ్యవస్థలో పేరుకుపోయిన కేసులను పరిష్కారించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. సత్వర న్యాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేసులు భారీగా పేరుకుపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. వాటిని పరిష్కరించడం తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు. జిల్లా, సబ్-కోర్టుల పనితీరులో ఉన్న సవాళ్లను గుర్తించడానికి హైకోర్టులతో సంప్రదింపులు జరుపుతానని తెలిపారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించడానికి అయిదు, ఏడు, తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాలను నియమిస్తానని, అతి త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని జస్టిస్ సూర్య కాంత్ పేర్కొన్నారు. కోర్టులపై భారాన్ని తగ్గించడానికి మధ్యవర్తిత్వం, ఇతర ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి కమ్యూనిటీ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+