కెసిఆర్ వ్యూహం: వివేక్‌పై రసమయి బాలకిషన్?
హైదరాబాద్: తిరిగి కాంగ్రెసులోకి వెళ్లిన సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్‌పై ప్రముఖ తెలంగాణ గాయకుడు రసమయి బాలకిషన్‌ను పోటీకి దించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భావిస్తున్నట్లు సమాచారం. వివేక్ తెరాస నుంచి సోమవారంనాడే కాంగ్రెసులో చేరారు. దీంతో వివేక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలనే ఉద్దేశంతో ధూమ్‌ధామ్ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజల్లో విశేష ఆదరణ పొందిన రసమయి బాలికిషన్‌ను కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోకసభ సీటు నుంచి కెసిఆర్ పోటీకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రసమయి బాలకిషన్ ఇటీవలే తెరాసలో చేరారు. పెద్దపల్లి సీటును వివేక్‌కు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దానిపై కెసిఆర్ దృష్టి పెట్టలేదు. అనూహ్యంగా వివేక్ కాంగ్రెసులోకి తిరిగి వెళ్లడంతో రసమయి బాలకిషన్ పేరు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.

కాంగ్రెసు నుంచి పెద్దపల్లి లోకసభ స్థానం నుంచి విజయం సాధించిన వివేక్ కొద్ది కాలం క్రితం తెరాసలో చేరారు. అయితే, కాంగ్రెసు అధిష్టానం ఆయన లోకసభ సభ్యత్వం రద్దుకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు.
తెరాసతో కాంగ్రెసు పొత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఇంత కాలం వివేక్ తెరాసలో కొనసాగినట్లు తెలుస్తోంది. పొత్తు ఉండదని తేలడంతో వివేక్, తన సోదరుడు వినోద్‌తో కలిసి కాంగ్రెసులోకి తిరిగి వెళ్లారు. గత కొద్ది కాలంగా కెసిఆర్ తీరు పట్ల వివేక్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications