బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మల్టీఫ్లెక్స్ లో కాలా సినిమా, కన్నడ సంఘాల ధర్నా, ఫ్యాన్స్ ను పంపించిన పోలీసులు, షో !

|
Google Oneindia TeluguNews

Recommended Video

బెంగళూరులో ఇంకా విడుదల కాని కాలా

బెంగళూరు: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమాను బెంగళూరులోని అనేక మాల్స్, మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో ప్రదర్శించడానికి సిద్దం అయ్యారు. అయితే కన్నడ సంఘాల ఆందోళనలు, ధర్నాలతో మాల్స్, మల్టీఫ్లెక్స్ యాజమాన్యం వెనక్కి తగ్గింది. పోలీసులు ఫ్యాన్స్ ను వెనక్కిపంపించారు.

బెంగళూరు నగరంలోని ట్రినిటీ సర్కిల్ లోని లిడో మల్టీఫ్లెక్స్ లోని నాలుగు స్క్రీన్లలో కాలా సినిమా ప్రదర్శించడానికి గురువారం యాజమాన్యం సిద్దం అయ్యింది. ముందుగానే లిడో యాజమాన్యం కాలా సినిమా టిక్కెట్లు విక్రయించారని తెలుసుకున్న కన్నడ సంఘాలు ట్రినిటీ సర్కిల్ చేరుకుని ఆందోళనకు దిగారు.

Kaala movie has not been released by any single screen theaters in Bengaluru.

కన్నడ సంఘాలు, రజనీకాంత్ అభిమానుల మధ్య వాగ్విదాం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. రజనీకాంత్ అభిమానులకు నచ్చచెప్పడానికి పోలీసులు ప్రయత్నించారు. కన్నడ సంఘాల ఆందోళన ఎక్కువ కావడంతో లిడో మల్టీఫ్లెక్స్ యాజమాన్యం కాలా సినిమా ప్రదర్శన రద్దు చేస్తున్నామని ప్రకటించింది.

బెంగళూరులోని మంత్రి మాల్, గరుడా మాల్, పీవీఆర్ తదితర మల్టీఫ్లెక్స్ ల్లో కాలా సినిమా ప్రదర్శించడానికి సిద్దం అయ్యారు. కన్నడ సంఘాల ఆందోళనతో పోలీసులు మాల్స్ దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపుతప్పుతుందని గ్రహించిన పోలీసులు కాలా సినిమా చూడటానికి వచ్చిన రజనీకాంత్ అభిమానులను వెనక్కి పంపించారు. మొత్తం మీద బెంగళూరులో ఇప్పటి వరకూ ఒక్క స్క్రీన్ మీద కూడా కాలా సినిమాను ప్రదర్శించలేదు.

English summary
Kaala movie has not been released by any single screen theaters in Bengaluru. But Mals like Mantri, Garuda, Lido may screen the movie. Kannada organization members protesting against the movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X