నిజంగా ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా ? ఒక్క రాత్రి లోనే ??
భారతదేశ ప్రాచీన, రహస్య ఆలయాల్లో మధ్యప్రదేశ్ మోరెనాలోని సిహోనియా కాకన్మఠ్ శివాలయం ఒకటి. ఎప్పుడైనా కూలిపోతుందేమో అనిపించినా, శతాబ్దాలుగా పటిష్టంగా నిలిచి ఉంది. దీని ప్రత్యేక నిర్మాణం వల్ల "దెయ్యాలు నిర్మించిన ఆలయం"గా ఇది ప్రసిద్ధి చెందింది. దెయ్యాలు ఒక్క రాత్రిలో నిర్మించాయని, అయితే తిరగలి శబ్దానికి భయపడి పారిపోవడంతో నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయిందని స్థానికులు నమ్ముతారు.
ఈ కథలకు శాస్త్రీయ ఆధారాల్లేవు. చరిత్రకారుల ప్రకారం, 11వ శతాబ్దంలో కచ్వాహా రాజు కీర్తి రాజ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. శివభక్తురాలైన ఆయన భార్య రాణి కాక్నవతి పేరు మీదుగానే దీనికి "కాకన్మఠ్" అని పేరు వచ్చింది. 115 అడుగుల ఎత్తులో, సిమెంట్ లేకుండా భారీ రాళ్లను సమతుల్యం చేస్తూ నిర్మించిన ఈ అద్భుతం ఇప్పుడు శిథిలమైనా, గర్భగుడిలో శివలింగంతో సందర్శకులను ఆకర్షిస్తోంది.

(గమనిక: ఈ కథనంలోని సమాచారం మతపరమైన, సాధారణ నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనిని ఖచ్చితమైన నిజంగా లేదా శాస్త్రీయంగా రుజువు చేయబడినదిగా పరిగణించకూడదు. )












Click it and Unblock the Notifications