టీడీపీ నుంచి రాజ్యసభకు ఊహించని ఎంపిక, జనసేన నుంచి ఆయనకే..!?
ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. అసెంబ్లీలో సంఖ్యా బలం ఆధారంగా కూటమికే నాలుగు సీట్లు దక్కనున్నాయి. కూటమిలోని మూడు పార్టీలు నాలుగు సీట్లను షేర్ చేసుకునే విధంగా నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగా టీడీపీ, జనసేన అభ్యర్ధుల పైన ఒక అంచనాకు వచ్చారు. టీడీపీ నుంచి ఊహించని విధంగా ఈ సారి రాజ్యసభ అభ్యర్ధులు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా.. జనసేన నుంచి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీతో పాటు సానా సతీష్ పదవీ కాలం వచ్చే నెలతో ముగుస్తోంది. కూటమిలోని మూడు పార్టీలు ఈ నాలుగు సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టీడీపీకి రెండు, జనసేన - బీజేపీకి చెరో సీటు కేటాయించనున్నారు. ఇప్పటికే ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. టీడీపీ - జనసేన నుంచి దక్కే మూడు స్థానాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీ సానా సతీశ్ కు రెన్యువల్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. మరో రెండు స్థానాల కోసం టీడీపీ నుంచి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జనసేన నుంచి పారిశ్రా మిక వేత్త లింగమేనని రమేశ్ పేరు ఖాయమని చెబుతున్నారు.

సామాజిక - ప్రాంతీయ లెక్కలే ఆధారంగా
దీంతో, జనసేన నుంచి లింగమేనని పేరు ఖరారైతే... టీడీపీ నుంచి అదే సామాజిక వర్గానికి తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది సందేహంగా మారుతోంది. కాగా.. టీడీపీ నుంచి బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్నవారిలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, కంభంపాటి రామ్మోహనరావు, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్ ఉన్నారు ఎస్సీ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే తన పేరు పరిశీలించాలని సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేరు వినిపిస్తోంది. అయితే.. ఈ సారి అనూహ్యంగా ముస్లి మైనార్టీ వర్గం కు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ కోటాలో ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ. షరీఫ్ కు దక్కే అవకాశం ఉంది. బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కు ఖాయం అవుతుందని చెబుతున్నారు. దీంతో.. టీడీపీ నుంచి రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుందనేది మహానాడు తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications