కలాం మృతి: సండే సెలవు, కాదు.. కేరళ కన్ఫ్యూజన్

తిరువనంతపురం: 'నేను మరణిస్తే సెలవు ప్రకటించవద్దు. అదనంగా మరో రోజు పని చేయాలి. అలా చేస్తే నాకు అనందం' అని చెప్పిన మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం చెప్పారు. దీనిని ఆదర్శంగా తీసుకొని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ ట్వీట్ చేశారు. ఇది గందరగోళానికి దారి తీసింది.

అబ్దుల్ కలాంకు నివాళిగా ఆదివారం నాడు కేరళ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి థామ్సన్ సామాజిక అనుసంధాన వేదిక ద్వారా వెల్లడించారు.

Kalam death: Kerala CS says Sunday will be working day, govt rejects proposal

దీనితో ప్రభుత్వం విభేదించింది. వెంటనే దానిని తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కలాం మృతి నేపథ్యంలో కేంద్రం ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆయన మరణం నేపథ్యంలో సెలవు మాత్రం ప్రకటించలేదు.

అబ్దుల్ కలాంకు నివాళిగా ప్రభుత్వ సీఎస్ కూడా ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని చెప్పినప్పటికీ, కేరళ ప్రభుత్వం దానిని తొలగించాలని సూచించింది. అయితే, ఆ పోస్టును అతను తొలగించే బదులు, తుది నిర్ణయం కోసం కాసేపు నిరీక్షించాలని ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+