హీరో కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీ పేరు, గుర్తు ఖరారు, పుట్టిన రోజు ప్రకటన, క్లారిటీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న ప్రముఖ బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ 11 రోజుల్లో తన కొత్త పార్టీ పేరు, గుర్తు ప్రకటించడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది. కమల్ హాసన్ పక్కా క్లారిటీతో రాజకీయాల్లోకి రావడానికి సిద్దం అయ్యారని సమాచారం.

హీరో కమల్ హాసన్ కు సినిమా కష్టాలు: కేసు నమోదు చెయ్యండి: మద్రాసు హైకోర్టు ఆదేశాలు !

గత కొంత కాలంగా తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మీద కమల్ హాసన్ విమర్శలు చేస్తున్నారు. తమిళనాడులోని అవినీతి మంత్రులు బండారం సోషల్ మీడియాలో పెట్టాలని కమల్ హాసన్ తన అభిమానులకు సూచించి కలకలం సృష్టించారు.

 వివాదాస్పద వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడులో ఇటీవల డెంగ్యూ జ్వరం ఎక్కువ కావడంతో కమల్ హాసన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వీలుచిక్కినప్పుడు తమిళనాడు ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. డెంగ్యూ జర్వం నివారణకోసం ప్రజలకు పంపిణి చేస్తున్న నీలవేంబు ఆయుర్వేద ఔషదం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 హీరోకు సినిమా కష్టాలు

హీరోకు సినిమా కష్టాలు

నీలవేంబు ఆయుర్వేద ఔషదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని సమాజసేవకుడు జీ. దేవరాజ్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించడంతో బుధవారం ఆయన మీద కేసు నమోదు చెయ్యాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

 ఒత్తిడితో కమల్ నిర్ణయం

ఒత్తిడితో కమల్ నిర్ణయం

కమల్ హాసన్ మీద కేసు నమోదు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలని ఆయన మీద సన్నిహితులు, అభిమానులు ఒత్తిడి తీసుకు వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే విషయంలో కొంత కాలంగా బిజీ అయిన కమల్ హాసన్ త్వరలో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించారని తెలిసింది.

 పార్టీ పేరు, గుర్తు కోసం !

పార్టీ పేరు, గుర్తు కోసం !

కమల్ హాసన్ ఏ పార్టీలో చేరరు, సొంత పార్టీతోనే ప్రజల ముందుకు వస్తారని ఆయన సన్నిహితులు ఇప్పటికే చెప్పారు. కమల్ హాసన్ ఇప్పటికే తన పార్టీ పేరు, జెండా విషయంలో క్లారిటీగా ఉన్నారని, ఆపనులు తన సన్నిహితులు, నిపుణులకు అప్పగించారని సమాచారం.

 పుట్టిన రోజు ముహుర్తం ఫిక్స్ !

పుట్టిన రోజు ముహుర్తం ఫిక్స్ !

నవంబర్ 7వ తేదీన బహుబాష నటుడు కమల్ హాసన్ పుట్టిన రోజు. అదే రోజు ఆయన తన కొత్త పార్టీ పేరు ప్రకటిస్తారని గురువారం తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొదట గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ కమల్ హాసన్ పార్టీ పేరు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. పార్టీ పేరు, గుర్తు విషయంలో ఆలస్యం కావడంతో తన పుట్టిన రోజు నవంబర్ 7వ తేదీన కొత్త పార్టీ పేరు ప్రకటించాలని కమల్ హాసన్ నిర్ణయించారని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sources say that Actor Kamal Haasan may announce his political entry on his birth day, November 7

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి