పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసిన కమల్ హాసన్, మొబైల్ యాప్ విడుదల, ఉచిత ఆరోగ్య శిభిరాలు !

Posted By:
Subscribe to Oneindia Telugu
  Kamal Haasan Birthday : He Meets Rain-Hit Chennai Residents | Oneindia Telugu

  చెన్నై: బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ 63వ పుట్టిన రోజు వేడుకులకు దూరం అయ్యారు. తన పుట్టిన రోజువేడుకలు నిర్వహించరాదని కమల్ హాసన్ ఆయన అభిమానులకు మనవి చేశారు. పుట్టిన రోజు వేడుకలకు ఖర్చు చేసే నగదుతో పేద ప్రజలకు సహాయం చెయ్యాలని కమల్ హాసన్ మనవి చేశారు.

  కమల్ హాసన్ వెల్ఫేర్ క్లబ్ 39వ వార్షికోత్సవం సందర్బంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరంలో కమల్ హాసన్ పాల్గొన్నారు. చెన్నై నగరానికి 20 కిలో మీటర్ల దూరంలోని అవాడి ప్రాంతంలో కమల్ హాసన్ అభిమానులు ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు.

  Kamal Haasan cancelled his birthday bash taking into account the heavy rains

  మంగళవారం అవాడి ప్రాంతానికి చేరుకున్న కమల్ హాసన్ ఉచిత వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ చెన్నై నగరంతో పాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడటంతో అనేక మంది పేదలు అన్నం లేక అల్లాడుతున్నారని, చాల మంది అనారోగ్యానికి గురైనారని విచారం వ్యక్తం చేశారు.

  తన అభిమానులు అన్నం లేక అల్లాడుతున్న పేదలకు సహాయం చెయ్యాలని కమల్ హాసన్ మనవి చేశారు. ఇదే సమయంలో కమల్ హాసన్ మొబైల్ యాప్ విడుదల చేశారు. మొబైల్ యాప్ ద్వారా వచ్చే నిధులను పేద ప్రజల కోసం ఉపయోగిస్తామని కమల్ హాసన్ అన్నారు.

  ఇటీవల కమల్ హాసన్ హిందూ ఉగ్రవాదం ఉంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో ఆయన మీద బీజేపీ, హిందూ సంఘ, సంస్థలు మండిపడ్డాయి. కమల్ హాసన్ తన పుట్టి రోజు వేడుకలు నిర్వహించరాదని పదేపదే మనవి చెయ్యడంతో ఆయన అభిమానులు ఉచిత మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేసి పేదలకు దుస్తులు, దుప్పట్లు పంచిపెడితున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Kamal Haasan, who turns 63 today, cancelled his birthday bash taking into account the heavy rains that has been taking Chennai down lately.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి