చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయం మొదలైంది: కమల్ సంచలనం, రజినీకి ప్రత్యర్థేనా?

తమిళనాడు రాజకీయాలపై తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశారు. తన రాజకీయ ప్రయాణంపై స్పష్టత నిచ్చారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలపై తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశారు. తన రాజకీయ ప్రయాణంపై స్పష్టత నిచ్చారు. బుధవారం ఆయన తమిళనాడులో నిర్వహించిన ఓ వివాహ రిసెప్షన్‌కు అతిథిగా హాజరయ్యారు.

రాజకీయ ప్రయాణం మొదలైంది..

రాజకీయ ప్రయాణం మొదలైంది..

ఈ సందర్భంగా కమల్ హాసన్ తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. ‘ఈ ఫంక్షన్‌ కేవలం వివాహానికి సంబంధించినది కాదు. నా రాజకీయ ప్రవేశ ఆవిష్కరణ ఫంక్షన్‌ అనుకోండి. నా రాజకీయ ప్రయాణం మొదలైంది' అని కమల్ ప్రకటించారు.

ప్రజలకు చురక

ప్రజలకు చురక

‘ప్రతీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకోండి. డబ్బులు తీసుకుని దొంగలకు ఓట్లేసి మీరే ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చేశారు' అని కొంత ఆలోచింపజేసేలా మాట్లాడారు కమల్.

పోరాటం తప్పదు..

పోరాటం తప్పదు..

‘రాజకీయ దుస్థితి మారాల్సిన సమయం వచ్చింది. ఈ పోరాటం కొనసాగుతూనే ఉండాలి' అని ఈ సందర్భంగా కమల్‌ వ్యాఖ్యానించారు. కమల్‌ వ్యాఖ్యలతో ఆయన రాజకీయాల్లోకి వచ్చే సూచనలున్నాయని కొంతకాలంగా వస్తున్న వార్తలకు తెరదించినట్లయింది.

రజినీ కంటే ముందే

రజినీ కంటే ముందే

ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రాజకీయాల్లో వస్తారంటూ విస్తృత ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పలుమార్లు అభిమానులతో భారీ ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ రాజకీయ పార్టీపై మాత్రం రజినీ ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే కమల్ మాత్రం రజినీకంటే ముందే రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయడం గమనార్హం.

రజినీకి ప్రత్యర్థిగానేనా?

రజినీకి ప్రత్యర్థిగానేనా?

ఈ నేపథ్యంలో ఇంతకుముందు రజినీకి వ్యతిరేకంగా కమల్ మాట్లాడటం.. ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తాననటం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులుగానే ఉంటారా? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

English summary
Kamal Haasan, who has been criticising the government on social media, said that his political journey had begun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X