వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోయెస్ గార్డెన్ లో ఐటీ దాడులు, క్రిమినల్స్ ఎంతో కాలం అధికారంలో ఉండరు: కమల్ !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో జరిగిన ఐటీ శాఖ సోదాలపై ప్రముఖ బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్ ఎక్కువ రోజులు అధికా

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో జరిగిన ఐటీ శాఖ సోదాలపై ప్రముఖ బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్ ఎక్కువ రోజులు అధికారంలో ఉండరని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

తమిళనాడు ప్రభుత్వం ఎంత అవినీతిమయం అయ్యిందో చెప్పడానికి ఇటీవల తమిళనాడులో జరుగుతున్న ఐటీ శాఖ దాడులు అద్దం పడుతోందని కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జయలలిత నివాసంతో పాటు తమిళనాడులో 187 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారని కమల్ హాసన్ గుర్తు చేశారు.

Kamal Haasan hits at AIADMK govt on Poes Garden IT raids

తమిళనాడు ప్రభుత్వం ప్రజల సోమ్ము లూటీ చేస్తోందని ఆరోపిస్తూ కమల్ హాసన్ తమిళంలో ట్వీట్ చేశారు. క్రిమినల్స్ ఎక్కువ కాలం అధికారంలో ఉండని, ప్రజలు మిమ్మల్ని క్షమించరని తమిళనాడు ప్రభుత్వం మీద కమల్ హాసన్ మండిపడ్డారు. కమల్ హాసన్ వ్యాఖ్యలపై తమిళనాడు మంత్రులు విరుచుకుపడుతున్నారు.

కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశం విషయంలో స్పంధించిన మంత్రులు ఆలూ లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు కమల్ హాసన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవ చేశారు. కమల్ హాసన్ మంచి వైద్యుల దగ్గర చికిత్స చేయించుకోవాలని, అలా చేస్తే ఆయనకే మంచిదని తమిళనాడు మంత్రులు సలహాలు ఇస్తున్నారు.

English summary
In a fresh jibe, apparently targeting the AIADMK government in Tamil Nadu, actor Kamal Haasan has said criminals cannot stay in power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X