కంగనా రనౌత్ తప్పులో కాలేసింది! ప్రత్యర్థికి బదులు సొంత పార్టీ నేతపైనే విమర్శలు

బాలీవుడ్‌లో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ తాజా లోక్‌సభ ఎన్నికల్లో దిగి రాజకీయ రంగంలో రాణించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

అయితే, తాజాగా, ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ గందరగోళానికి గురయ్యారు. ప్రత్యర్థి పార్టీ నేతను విమర్శించాల్సింది పోయి.. సొంత పార్టీ నేతపైనే విరుచుకుపడ్డారు. అయితే, ఆ నేతలిద్దరి పేర్లు దాదాపు ఒకటిగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Kangana Ranaut Wanted To Attack INDIA alliance Leader Tejashwi Yadav but Targeted BJP s Tejasvi Surya Instead

ఆ వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కంగనా రనౌత్ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు. అవినీతి పరుల పార్టీ ఇక్కడ ఉంది. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలని కలలు కనే రాహుల్ గాంధీ.. రౌడీయిజం చేసి, చేపలు తినే తేజస్వీ సూర్య ఇందులో ఉన్నారు అని ఆమె విమర్శించారు. అయితే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు బదులు ఆమె బీజేపీ నేత తేజస్వీ సూర్య(కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అభ్యర్థి) పేరును ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, కంగనా రనౌత్‌కు సంబంధించిన ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. అంతేగాక, దీనిపై స్పందిస్తూ.. ఆమె ఎవరు? అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు, ఎంపీగా పోటీ చేసేందుకు ఆమెకు ఉన్న అర్హతలేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఏడో విడతలో భాగంగా జూన్ 1న కంగనా రనౌత్ పోటీలో ఉన్న మండి నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+