వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేశ్ కూడా.. 28వ తేదీన ముహూర్తం ఖరారు..

|
Google Oneindia TeluguNews

కన్హయ్య కుమార్.. మాజీ జేఎన్యూ నేత.. కీలక నిర్ణయం తీసుకున్నారు. కమ్యునిస్ట్ పార్టీకి చెందిన ఆయన పార్టీ మారబోతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిగాయి. కన్హయ్యతోపాటు దళితనేత జిగ్నేశ్ మేవాని కూడా పార్టీ మారబోతున్నారు. ఈ నెల 28వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇదివరకు కన్హయ్య కుమార్ రాహుల్ గాంధీని కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పార్టీ మార్పు అంశం చర్చకు వచ్చింది. ఇంతలో పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చింది.

వాస్తవానికి ఈ నెల 27వ తేదీన పార్టీ మారాలని అనుకున్నారు. ఆ రోజు సహీద్ భగత్ సింగ్ జయంతి.. అయితే ఆ రోజున రైతు నేతలు ఆందోళన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఆందోళనలతో రాహుల్ గాంధీ పాల్గొంటారు. రాహుల్ గాంధీతో పాటు హర్దిక్ పటేల్ కూడా అటెండ్ అవుతారని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవాని పార్టీలో చేరిక మరుసటి రోజుకు వాయిదా పడింది.

Kanhaiya Kumar, Jignesh Mevani to join Congress on September 28

కన్హయ్య కుమార్.. జేఎన్‌యూలో ఫేమ్ అయ్యారు. సీపీఐ పార్టీలో ఇప్పుడు ఉన్న.. అంతకుముందు ఆ పార్టీకి చెందిన విద్యార్థి విభాగంలో పనిచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి.. వార్తల్లోకి వచ్చారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బెగసరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ విజయం సాధించారు. బీహర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు. కన్హయ్య కుమార్ పార్టీ మారబోతున్నారు. ఇదీ ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరనుంది. జిగ్నేశ్ మేవాని దళిత నేత.. గుజరాత్‌లోని వాడగామ్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీని వీడారు.

ఇదిలా ఉండ‌గా గుజ‌రాత్ రాజ‌కీయాల్లో జిగ్నేష్ మేవాని సంచ‌ల‌నం సృష్టించారు. ప్ర‌ధాని రాష్ట్రంలో బీజేపీ హ‌వా ఉన్న స‌మ‌యంలో జిగ్నేష్ గెలిచి అంద‌రి దృష్టిని త‌నవైపు తిప్పుకున్నారు. జిగ్నేష్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా భ‌రిలోకి దిగిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ స‌పోర్ట్ తోనే ఆయన గెలిచారు. ఇక సీపీఐ నుండి గెలిచిన క‌న్హ‌య్య కాంగ్రెస్ ఆహ్వానంతో పార్టీలో చేరుతున్నారు.

English summary
descFormer JNU student leader Kanhaiya Kumar and Dalit leader Jignesh Mevani will join the Congress party on September 28, as per party sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X