సినీ నిర్మాతతో లేచిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్తె, హీరో విజయ్ ఎంట్రీ, సీన్ రివర్స్ !

Posted By:
Subscribe to Oneindia Telugu
  MLA's daughter married Masti Gudi producer, Duniya Vijay supports

  బెంగళూరు: నిశ్చితార్థం జరిగిన తరువాత కన్నడ సినీ నిర్మాతతో లేచిపోయి రహస్యంగా వివాహం చేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమార్తె లక్ష్మి నాయక్ బెంగళూరులోని యలహంక న్యూ టౌన్ పోలీసుల ముందు ప్రత్యక్షం అయ్యారు. హీరో విజయ్ ఎంట్రీతో నవదంపతులు పోలీసుల ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఈ దెబ్బకు నమోదు అయిన మిస్సింగ్ కేసు రివర్స్ అయ్యింది.

  మైసూరు నుంచి జంప్

  మైసూరు నుంచి జంప్

  గురువారం మైసూరు నగరం సమీపంలోని చాముండేశ్వేరి దేవాలయంలో రహస్యంగా వివాహం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమార్తె లక్ష్మి నాయక్, కన్నడ మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్ పి. గౌడ మైసూర్ నుంచి ఎవ్వరికంట పడకుండా అక్కడి నుంచి జంప్ అయ్యారు.

  హనీమూన్ రివర్స్

  హనీమూన్ రివర్స్

  నవదంపతులు లక్ష్మి నాయక్, సుందర్ పి. గౌడ హనీమూన్ వెలుతారని అందరూ అనుకున్నారు. అయితే వారి అంచనాలను తారుమారు చేస్తూ లక్ష్మి నాయక్, సినీ నిర్మాత సుందర్ పి. గౌడ అనేక మార్గాల్లో బెంగళూరు నగరం చేరుకున్నారు.

  హీరో విజయ్ ఎంట్రీ

  హీరో విజయ్ ఎంట్రీ

  గురువారం రాత్రి బెంగళూరులోని హీరో దునియా విజయ్ ఇంటికి నవదంపతులు లక్ష్మీ నాయక్, సుందర్ పి. గౌడ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం హీరో దునియా విజయ్ నవదంపతులు లక్ష్మీ నాయక్, సుందర్ పి. గౌడను యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు.

  లక్ష్మి నాయక్ క్లారిటి

  లక్ష్మి నాయక్ క్లారిటి

  సుందర్ పి. గౌడను తాను ప్రేమించి తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నానని, ఈ విషయంలో ఎవ్వరూ తనను బలవంతం చెయ్యలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమార్తె లక్ష్మి నాయక్ యలహంక న్యూ టౌన్ పోలీసు అధికారులకు చెప్పారు.

  అమ్మ, అవ్వ

  అమ్మ, అవ్వ

  లక్ష్మి నాయక్ పోలీసులకు చెప్పిన మాటలు విన్న ఆమె అవ్వ తీవ్రఅస్వతస్తకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. కుమార్తె లక్ష్మి నాయక్ కు నచ్చ చెప్పడానికి ఆమె తల్లి హీరో దునియా విజయ్ ఇంటికి వెళ్లారు. కుమార్తె లక్ష్మి నాయక్ తో ఆమె మాట్టాడుతున్నారు.

  ఆమెకు 22, అతనికి 35

  ఆమెకు 22, అతనికి 35

  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమారుడు సూరజ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ తన సోదరి లక్ష్మి నాయక్ వయసు 22 ఏళ్లు అని అన్నారు. సుందర్ పి. గౌడ వయసు 35 ఏళ్లు అని చెప్పారు. ఇద్దరికీ వయసులో ఎంతోతేడా ఉందని గుర్తు చేశారు.

  హీరో విజయ్ చెప్పాలి

  హీరో విజయ్ చెప్పాలి

  లక్ష్మి నాయక్ తాను సుందర్ పి. గౌడను ప్రేమిస్తున్నానని కుటుంబ సభ్యులకు ఒక్క మాటకూడా చెప్పలేదని ఆమె సోదరుడు సూరజ్ నాయక్ అన్నారు. కనీసం హీరో దునియా విజయ్ చెప్పినా తాము వారి ప్రేమను అంగీకరించి పెళ్లి చేసేవాళ్లమని సూరజ్ నాయక్ చెప్పారు.

  సుఖంగా ఉండాలి

  సుఖంగా ఉండాలి

  వయసులో తేడా ఉన్నా, పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా తన సోదరి లక్ష్మి నాయక్, సుందర్ పి. గౌడ ఎక్కడ ఉన్నా సంతోషంగా, క్షేమంగా ఉండాలని సూరజ్ నాయక్ చెప్పారు. మా కుటుంబ సభ్యులు లక్ష్మి నాయక్ పెళ్లిని వ్యతిరేకించడం లేదని సూరజ్ నాయక్ అన్నారు.

  కాంగ్రెస్ ఎమ్మెల్యే

  కాంగ్రెస్ ఎమ్మెల్యే

  కుమార్తె లక్ష్మి నాయక్ కుటుంబ సభ్యులను ఎదిరించి రహస్యంగా వివాహం చేసుకోవడంతో ఆమె తండ్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ ఇంటి నుంచి బయటకురాలేదు. మీడియా ఆయనను కలుసుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Kannada actor Duniya Vijay supporrts MLA's daughter Lakshmi Nayak and Film producer Sundar Gowda marriage. He gave shelter to the newly married couple in his House. and today he bring them to Yelhanka police station to record their statements.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి