బెంగళూరులో హీరోను చితకబాదిన దుండగులు, నిలువు దోపిడి, గూబపగిలింది, కారుతో జంప్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగరంలో సామాన్యులకే కాదు సినిమా హీరోలకు భద్రత లేకుండాపోయింది. కారులో ఇంటికి వెలుతున్న స్యాండిల్ వుడ్ హీరో మీద దాడి చేసిన దుండగులు నిలువు దోపిడీ చేసి కారుతో సహ పరారైన ఘటన బెంగళూరులోని బసవేశ్వరనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హీరో గూబపగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆప్తమిత్రరు

ఆప్తమిత్రరు

స్యాండిల్ వుడ్ లో తెరకెక్కిన ఆప్తమిత్రరు (ఆప్తమిత్రులు) అనే సినిమాలో కార్తీక్ విక్రమ్ హీరోగా నటించాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఆప్తమిత్రరు విడుదల చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆప్తమిత్రరు సినిమాకు నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అర్దరాత్రి హీరో

అర్దరాత్రి హీరో

మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత స్యాండిల్ వుడ్ హీరో కార్తీక్ విక్రమ్ స్నేహితుడిని అతని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మారుతి షిఫ్ట్ కారులో ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో బసవేశ్వర నగర్ లోని వాటర్ ట్యాంక్ దగ్గర 8 మంది గుర్తు తెలియని వ్యక్తులు కార్తీక్ విక్రమ్ కారు అడ్డగించారు.

హీరో నిలువు దోపిడి

హీరో నిలువు దోపిడి

కారులో ఉన్న హీరో కార్తీక్ విక్రమ్ ను బయటకు లాగిన దుండగులు అతని మీద దాడి చేశారు. తరువాత కార్తీక్ విక్రమ్ దగ్గర ఉన్న రూ. 50 వేలు, విలువైన మొబైల్ లాక్కొన్నారు. కార్తీక్ విక్రమ్ ను రోడ్డు పక్కకు నెట్టివేసిన దుండగులు సిఫ్ట్ కారుతో సహ పరారైనారు.

హీరో గూబపగిలింది

హీరో గూబపగిలింది

హీరో కార్తీక్ విక్రమ్ బసవేశ్వర నగర్ లోని పుణ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చెవ్వు మీద బలంగా దాడి చెయ్యడంతో ఆయనకు వినపడటం లేదని వైద్యులు చెప్పారని పోలీసులు అన్నారు. బసవేశ్వర నగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kannada movie 'Apthamithraru'actor Karthik Vikram was attacked by seven unknown persons in Basaveshwara nagara, Bengaluru last night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి