బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛీ: బెంగళూరు యూబీ సిటీ బార్ లో నటిపై లైంగిక దాడి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పీకలదాక మద్యం సేవించిన బిల్డర్ కుమారుడు అదే బార్ లో స్నేహితులతో కలిసి ఉన్న టీవీ నటిపై లైంగికదాడికి యత్నించిన ఘటన బెంగళూరు నగరంలో సంచలనం రేపింది. అందరూ చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బెంగళూరులో ప్రముఖ బిల్డర్ అయిన శ్రీనివాస్ కుమారుడు దర్శన్ ఆదివారం అర్దరాతి విఠల్ మాల్యా రోడ్డులోని యూబీ సిటీలో 16వ అంతస్తులో ఉన్న స్కైబార్ కు వెళ్లి పీకలదాక మద్యం సేవించాడు. సర్ప సంబంధ అనే కన్నడ సీరియల్ లో నటిస్తున్న ఒక నటి స్నేహితులతో కలిసి స్కైబార్ కు వెళ్లింది.

అర్దరాత్రి దాటిన తరువాత 1.20 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న దర్శన్ ఆమె మీద ఎక్కపడితే అక్కడ చేతులు వేసి లైంగిక దౌర్జన్యం చేశాడు. ఆమె అభ్యంతరం చెప్పడంతో పక్కకు లాక్కెళ్లి గొంతు భాగంలో గట్టిగా కొరికినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Kannada TV Actress files Molestation complaint against builder’s Son in Bengaluru

ఆ సమయంలో దర్శన్ చేష్టలు మితిమీరడంతో నటి స్నేహితులు అతన్ని పట్టుకుని చితకబాదేశారు. వెంటనే దర్శన్ తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించుకుని నటి స్నేహితుల మీద దాడికి దిగాడు. ఆ సమయంలో స్కైబార్ రణరంగం అయ్యిందని సమాచారం.

తరువాత నటి కబ్బన్ పార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇన్స్ స్పెక్టర్ నాగరాజ్ ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. వెంటన్ సీఐ బిల్డర్ శ్రీనివాస్ కు ఫోన్ చేసి చెప్పగా ఆయన పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి రాజీచేశారు.

అప్పటికే టీవీల్లో ఈ విషయం ప్రసారం కావడంతో రాజీ చెయ్యడానికి ప్రయత్నించిన ఇన్స్ స్పెక్టర్ నాగరాజ్ మీద పై అధికారులు మండిపడ్డారని సమాచారం. అయితే బుల్లితెర నటి మాత్రం తరువాత మాట మార్చేసింది.

తనమీద లైంగికదౌర్జన్యం జరగలేదని, దర్శన్ అసభ్యంగా మాట్లాడాడని, తరువాత క్షమాపణలు చెప్పాడని, తాను కేసు వెనక్కి తీసుకున్నానని మాటమార్చింది. ఈ విషయంలో పెద్దలు జోక్యం చేసుకోని రాజీ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

దర్శన్, టీవీ నటి ఇద్దరూ స్నేహితులు అని తెలిసిందని, దర్శన్ క్షమాపణ పత్రం రాసిచ్చారని, ఆమె దర్శన్ మీద లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీ డాక్టర్ చంద్రగుప్త స్పష్టం చేశారు.

English summary
Bengaluru Central DCP Dr Chandragupta said, We will register a case if she files a complaint of harassment. A few men and women had drinks and got into an argument.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X