రూ. 15 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్:లేదంటే, టీవీ చానల్ సీఈవో అరెస్టు
రూ. 15 కోట్లు ఇవ్వకపోతే నీ అంతు చూస్తానని పారిశ్రామికవేత్తను బెదిరించాడని ఆరోపిస్తూ ఓ టీవీ చానల్ సీఈవో లక్ష్మిప్రసాద్ వాజ్ పేయిని బెంగళూరులోని కోరమంగల పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
బెంగళూరు: పారిశ్రామికవేత్తను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపిస్తూ కన్నడ ప్రయివేట్ టీవీ చానల్ సీఈవోను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కన్నడ ప్రయివేటు టీవీ చానల్ సీఈవో లక్ష్మిప్రసాద్ వాజ్ పేయిని అరెస్టు చేశారు.
ప్రముఖ కన్నడ టీవీ చానల్ సీఈవో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పారిశ్రామికవేత్త బెంగళూరులోని కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండ రూ. 15 కోట్లు ఇవ్వకపోతే నీ అంతు చూస్తానని బెదిరించాడని ఆయన పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు టీవీ చానల్ సీఈవో లక్ష్మిప్రసాద్ వాజ్ పేయి మీద నిఘా వేశారు. అనుమానం రావడంతో లక్ష్మిప్రసాద్ వాజ్ పేయిని పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మిప్రసాద్ మీద ఐపీసీ సెక్షన్ 384, 385, 506 సెలక్షల కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
టీవీ చానల్ సీఈవో లక్ష్మి ప్రసాద్ వాజ్ పేయి మీద గతంలో బెంగళూరు నగరంలోని కమర్షియల్ స్ట్రీట్, మహాలక్ష్మి లేఔట్ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. టీవీ చానల్ సీఇవో ఇంకా ఎంత మందిని ఇలా బ్లాక్ మెయిల్ చేశారు అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications